లవర్ కోసం...('గలాటా' ప్రివ్యూ)
హైదరాబాద్: కామెడీతో కథ చెపితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకేనేమో చిన్నా,పెద్దా తేడాలేకుండా ప్రతీ చిత్రం తమకున్న పరిధిలో కామెడీని పండించటానికి ప్రయత్నం చేస్తోంది. ఈ రోజుల్లో చిత్రంతో పరిచయమైన శ్రీ ని హీరోగా తీసుకుని రూపొందిన గలాటా చిత్రం ఈ రోజు థియోటర్స్ లో గలాటా చేయటానికి దిగుతోంది.
బుచ్చిబాబు (శ్రీ) ముంబైలో ఉంటాడు. పెద్ద జాదూగాడు. అమ్మాయితో రెండు నిమిషాలు మాట్లాడితే.. మూడో నిమిషంలో బుట్టలో పడేస్తాడు. వీడిక్కడే ఉంటే.. ఎవరినో ఒకరిని ఎత్తుకొచ్చేస్తాడన్నది వాడి బామ్మ భయం. 'హైదరాబాద్ వెళ్లి ఓ సంప్రదాయబద్ధమైన తెలుగమ్మాయిని పెళ్లిచేసుకొని రా..' అని పంపిస్తుంది. అందుకే మకాం హైదరాబాద్‌కు మారుస్తాడు. ఇక్కడ ఆండాళ్ (హరిప్రియ) పరిచయం అవుతుంది. ఆమె పెద్ద కిలాడీ. ఢీ అంటే ఢీ అనే రకం. హోంమంత్రి పెద్దిరెడ్డి (సాయికుమార్) వల్ల సమస్యలో చిక్కుకుంటుంది ఆండాళ్. అందులోంచి ఆ అమ్మాయిని బుచ్చిబాబు ఎలా కాపాడాడు? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అనేదే ఈ చిత్ర కథ. చిత్తూరు సుభానీ (అలీ) పాత్ర కూడా కీలకమే.

దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ బామ్మ మాటకోసం అందమైన తెలుగమ్మాయిని అన్వేషించుకుంటూ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంటాడు చిట్టి. అలాంటి చిట్టిని తొలిచూపులోనే ప్రేమలో పడేస్తుంది ఆండాళ్. అయితే ఆమె వల్ల చిక్కుల్లో పడతాడు చిట్టి. ఇక ఆమె ప్రేమను ఎలాగైనా పొందడం కోసం ఆ సమస్యల్ని ఎలా అధిగమించాడు? చివరకు ఆమె ప్రేమను ఎలా గెలిచాడు? అనేది ఆసక్తికరంగా వుంటుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ వినోదమే ప్రధానంగా తెరకెక్కుతోన్న నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ ఇది. నేటి యువతరం కోరుకునే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలు మేళవించి రూపొందిస్తున్న చిత్రమిది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఓ నవ్యమైన పాయింట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీ పాత్ర కొత్తగా వుంటుంది. హరిప్రియ అభినయం, గ్లామర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని తెలిపారు.
''ఆద్యంతం వినోదాలు పంచే కథ. హీరో,హీరోయిన్స్ ఎత్తుకు పై ఎత్తులు వేసుకొనే సన్నివేశాలు తమాషాగా ఉంటాయి. కృష్ణగారి సినిమా 'గూఢచారి 116'లోని 'నువ్వునా తోడుంటే..' పాటని యథాతథంగా ఈ సినిమాలో వాడుకొన్నాం. ఆ పాట ప్రత్యేక ఆకర్షణ''
చిత్రం: గలాట
సంస్థ: సీపీక్రియేటీవ్‌పిక్సల్స్
నటీనటులు: శ్రీ, హరిప్రియ, సాయికుమార్, అలీ, నాగ బాబు, జయప్రకాష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణమ్మ, మెల్కోటే, పథ్వీ, సాయికష్ణ, జై వేణు, కొండవలస తదితరులు తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్,
కెమెరా: ఫీరోజ్ ఖాన్,
పాటలు: కష్ణచైతన్య,
ఎడిటింగ్: నికోలస్,
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కష్ణ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి,
నిర్మాత: రాజేంద్రప్రసాద్ వర్మ.
విడుదల: శుక్రవారం(25 ఏప్రియల్,2014)


Click it and Unblock the Notifications











