మరో యూత్ లవ్ స్టోరీలో జెనీలియా

గతంలో తరుణ్‌తో "ఒక ఊరిలో" చిత్రం ద్వారా దర్శకుడైన పబ్లిసిటీ డిజైనర్ రమేష్‌వర్మ తన తాజా చిత్రానికి జెనీలియాని హీరోయిన్ గా అడిగినట్లు ఫిలిం నగర్ సమాచారం. ఇక ఆ సినిమాకా "శ్రీశ్రీ" అనే పేరును కూడా రిజిస్టర్ చేయించారు. ఇంతకు ముందు ఈ టైటిల్ ని సుకుమార్ 'జగడం' సినిమాకు పెడదామనుకుని విరమించుకున్నాడు. ఇప్పుడు రమేష్ వర్మ దీన్ని హైజాక్ చేసారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ కథ "శ్రీ"వల్లీ అనే అమ్మాయి, "శ్రీనివాస్" అనే అబ్బాయిల మధ్య సాగే ఓ అందమైన ప్రేమకథా చిత్రం కనుక "శ్రీశ్రీ" అనే పేరును ఖరారు చేసినట్లు రమేష్ వర్మ చెప్పుతున్నారు.
శ్రీవల్లిగా జెనీలియాను ఎంపిచేశామని, ఇక ఆమె మనసును దోచుకునే శ్రీనివాస్ ఎవరనేది త్వరలో తెలియజేస్తామని ఆయన అంటున్నారు. 'దేవదాస్' ఫేమ్ రామ్‌ను మొదట హీరోగా అనుకున్నా అతను ప్రస్తుతం ఎం.ఎస్.రాజు చిత్రంలో బిజీగా ఉండటం, ఆ తదుపరి మరో చిత్రంలో బుక్ కావడంతో మరో యువ కథానాయుకుటు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందే ఆయన "మల్లెపూవు" అనే కథను రెడీ చేసుకున్నారు. తన స్నేహితుడైన వి. సముద్రకు నచ్చడంతో ఆ కథను రమేష్ వర్మ ఇచ్చేశారు. ఆ సినిమా 'బరాన్' అనే ఇరాన్ సినిమా నుంచి పుట్టిందని విన్పిస్తుంది. ఇక ఈ సినిమాలో జెనీలియాని ఎన్నుకోవటంతో నవతరం దర్శకులందరూ కూ ఆమె మరో సారి హాట్ ప్యావెరెట్ అని తేల్చి చెప్పినట్లయింది.ప్రస్తుతం జెనీలియా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'జర్నీ' సినిమాలో తరుణ్ సరసన చేస్తోంది.


Click it and Unblock the Notifications











