For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అర్జున్ రెడ్డి’ నటికి యాక్సిడెంట్: ప్రమాదం కాదు.. హత్యాయత్నం అంటూ సినీ ప్రముఖుడిపై ఫిర్యాదు

  |

  సినీ ప్రముఖులకు సంబంధించి ఏం జరిగానా సంచలనం అవుతూనే ఉంటాయి. అలాంటిది ఇండస్ట్రీలోని వ్యక్తుల మధ్య ఉండే వివాదాలు మరింత హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇలా చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోన్న గొడవల్లో 'అర్జున్ రెడ్డి' భామ శ్రీ సుధ రెడ్డి - కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు ఇష్యూ ఒకటి. కొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఇండస్ట్రీ వర్గాల్లోనే కలకలం రేపుతోన్న ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలుమార్లు శ్యామ్‌పై ఫిర్యాదు చేసిన శ్రీ సుధ.. తాజాగా విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాలు మీకోసం!

  ఐఫోన్ నుంచి అర్జున్ రెడ్డి మూవీ వరకు

  ఐఫోన్ నుంచి అర్జున్ రెడ్డి మూవీ వరకు

  శ్రీ సుధ రెడ్డి ‘ఐఫోన్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి యాక్టింగ్ కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత ఎన్నో షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోనూ నటించే అవకాశాన్ని అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో నలభైకి పైగా చిత్రాల్లో ఆమె నటించింది. ఇప్పటి వరకూ ఈమె నటించిన వాటిలో ‘అర్జున్ రెడ్డి', ‘అఆ', ‘ఈడోరకం ఆడోరకం' సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

  సినిమాల కంటే వివాదాలతోనే పాపులర్

  సినిమాల కంటే వివాదాలతోనే పాపులర్

  శ్రీ సుధ రెడ్డి ఎన్నో సినిమాలు, వ్యాపార ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించి మెప్పించింది. 2014 నుంచి 2020 వరకు ఆమె సపోర్టింగ్ రోల్స్, లీడ్ రోల్స్ చేసి సత్తా చాటింది. అయినప్పటికీ పెద్దగా గుర్తింపును అందుకోలేకపోయింది. కానీ, కెరీర్ ఆరంభం నుంచే ఏదో ఒక వివాదంలో భాగం అవుతూ పాపులర్ అయింది. దీంతో తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టే స్థాయికి ఎదిగిపోయింది.

  శ్యామ్ కే నాయుడు మోసం చేశాడంటూ

  శ్యామ్ కే నాయుడు మోసం చేశాడంటూ

  ఎన్ని సినిమాల్లో నటించినా సరైన బ్రేక్‌ను అందుకోలేకపోయింది శ్రీ సుధ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం అయింది. అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే నెలలో శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ న్యూస్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

  చంపుతామని బెదిరింపులు.. మరోసారి

  చంపుతామని బెదిరింపులు.. మరోసారి

  గతంలో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని శ్యామ్ కే నాయుడు తరపు వాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ శ్రీ సుధ రెడ్డి ఇటీవల మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. అంతేకాదు, ఆ కేసు విషయంలో తాను రాజీ పడినట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టుకు సమర్పించారని కూడా ఆమె ఆరోపించింది. అలాగే, కంప్లైంట్ చేసినా శ్యామ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదని గుర్తు చేసింది.

  విజయవాడ ఫ్లైఓవర్‌పై కార్ యాక్సిడెంట్

  విజయవాడ ఫ్లైఓవర్‌పై కార్ యాక్సిడెంట్

  హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీ సుధ రెడ్డి.. ఆ తర్వాత నుంచి సైలెంట్‌గా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విజయవాడలో ఆమె ప్రత్యక్షం అయింది. నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారుకు ప్రమాదం జరిగిందని తెలిపిన ఆమె.. అది యాక్సిడెంట్ కాదు.. తనపై హత్యాయత్నం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

  హత్యాయత్నం అంటూ ఆయనపై ఫిర్యాదు

  హత్యాయత్నం అంటూ ఆయనపై ఫిర్యాదు

  గతంలో తాను పెట్టిన హైదరాబాద్‌‌ కేసుకు, విజయవాడ ఘటనకు సంబంధం ఉందంటూ విజయవాడ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషనులో శ్రీ సుధ రెడ్డి గురువారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తూ యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ కెమెరామెన్ శ్యామ్‌ కే నాయుడిపై సందేహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లైంది.

  English summary
  Sri Sudha is a professional south Indian actress in the film industry. She has acted in many supporting roles in the Telugu movie industry. The full name of Sri Sudha is Sri Sudha Reddy. She is known for her character in the blockbuster Telugu movie Arjun Reddy which was released in the year 2017 with actors Vijay Devarakonda and actress Shalini Pandey as the main protagonists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X