పరిచయ చిత్రం 'లక్ష్యం' తో ఫ్యామిలీలను ఆకట్టుకుని హిట్టు కొట్టిన దర్శకుడు శ్రీవాస్. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించినా అతను ఆ తరువాత అసలు ఏమయ్యాడో ఎవరికి అర్ధం కాలేదు. తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి ఒక్క వార్తా రాలేదు. ఇప్పుడు మళ్ళీ రెండో సినిమాకి సిద్దపడుతున్నాడు. ఇన్ని రోజులు పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఒక స్క్రిప్ట్ తయారుచేసుకున్నాడట. మొదటి సినిమా గోపిచంద్ ,జగపతి బాబు కాంబినేషన్ తో చేసిన ఈ దర్శకుడు రెండో సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. భారీగా దిల్ రాజ్ దీనిని నిర్మించనున్నాడు. మరి తెలుగు దర్శకులకు ఉన్న రెండో సినిమా గండం ఈయనకి వర్తించదా అంటే పూర్తి స్ధాయిలో మైండ్ ని రాకింగ్ చేసే కథ.. బాంబులా పేలే ప్లాటు.. ఆగకుండా పరుగెత్తే నేరేషన్ తో స్క్రిప్టు రెడీ చేసుకుని వస్తున్నాను... నాకేం బెంగ లేదంటున్నాడు. అక్టోబర్ లో ప్రారంభమయ్యే ఈ సినిమాకి ఇప్పటికే ఎన్టిఆర్ పచ్చ జెండా ఊపాడట. వి.వి.వినాయక్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు లోకి ఎన్టిఆర్ దూకుతాడట.