For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆరు వరుస విజయాలు: దిల్ రాజు గ్రాండ్ పార్టీ, సందడి చేసిన స్టార్స్!

  By Bojja Kumar
  |
  2017-దిల్ రాజు గ్రాండ్ పార్టీ.. సందడి చేసిన స్టార్స్!

  టాలీవుడ్లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజుకు.... 2017 సంవత్సరం మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాది దిల్ రాజు 6 సినిమాలు నిర్మిస్తే ఆరు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా ఒకే సంవత్సరంలో డబల్ హాట్రిక్ కొట్టిన నిర్మాత లేడు. ఈ నేపథ్యంలో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ మోస్ట్‌ సక్సెఫుల్‌ ఇయర్‌(2017) పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సినిమాల్లో నటించిన నటీనటులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు.

  వరుస విజయాలు ఇవే

  వరుస విజయాలు ఇవే

  ఈ ఏడాది దిల్‌రాజు నిర్మించిన ‘శతమానంభవతి', ‘నేను లోకల్‌', ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌', ‘ఫిదా', ‘రాజా ది గ్రేట్‌', ‘ఎంసీఏ' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి.

  ఇది కేవలం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అర్జున్

  ఇది కేవలం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అర్జున్

  దిల్ రాజు నిర్మించి ‘డిజె-దువ్వాడ జగన్నాథమ్' చిత్రంలో హీరోగా నటించిన బన్నీ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఒకే సంవ‌త్స‌రంలో ఆరు స‌క్సెస్‌లు సాధించ‌డం దిల్ రాజుకే చెల్లిందని, నిజంగా ఇది ప్రత్యేకమని అన్నారు

  ఆ బాధ నుండి ఉపశమనం పొందారనుకుంటున్నా

  ఆ బాధ నుండి ఉపశమనం పొందారనుకుంటున్నా

  దిల్ రాజు సతీమణి చనిపోయిన సమయంలో ‘డీజే' షూటింగ్‌ జరుగుతోంది. ఎంతో బాధతో కుంగిపోయిన ఆయనకు ఈ ఆరు విజయాలు ఉపశమనం ఇచ్చాయని అనుకుంటున్నా. దిల్‌రాజుగారికి మరిన్ని మంచి సక్సెస్‌ రావాలని గట్టిగా కోరుకున్నాను అని బన్నీ ఆకాంక్షించారు.

  అపుడు యువరాజు, ఇపుడు దిల్ రాజు

  అపుడు యువరాజు, ఇపుడు దిల్ రాజు

  దర్శకుడు హరీష్ శంకర్‌ మాట్లాడుతూ.. ‘అప్పుడెప్పుడో యువరాజు ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. ఈ ఏడాది దిల్‌రాజు ఆరు సినిమాలు హిట్‌ కొట్టారు. దిల్ రాజుగారితో పని చేయడం ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆయన సెట్లోకి వస్తే దర్శకుడికి ఎలాంటి టెన్షన్ ఉండదు. దర్శకుడితో కలిసి ట్రావెల్ చేస్తూ స్పెషల్ కేర్ తీసుకుంటారు కాబట్టే ఆయన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారని హరీష్ శంకర్ తెలిపారు.

  కేవలం డబ్బు కోసం చేసే నిర్మాత కాదు

  సినిమాను కేవలం డబ్బు కోసం చేస్తే సక్సెస్ ఫుల్ నిర్మాత ఎప్పటికీ కాలేరు. సినిమాపై పాషన్‌తో పనిచేస్తే డబ్బులు అవే వస్తాయి. దిల్‌రాజుగారు పాషన్ తో చేయడంతో పాటు బాగా కష్టపడతారు. ఆయన 48 గంటలు ఏకధాటిగా పనిచేయడం చేశాను. ఆయన అలా కష్టపడతారు కాబట్టే ఈ సంవత్సరం వరుస విజయాలు అందుకున్నారు అని హరీష్ శంకర్ తెలిపారు.

  వ్యక్తిగతంగా చేదు జ్ఞాపకాలు ఉన్నప్పటికీ

  అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ''ఇయర్‌ ఎగ్జామ్స్‌ అయ్యాక స్టూడెంట్స్‌ అందరినీ లైన్‌లో పిలిచి ప్రైజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సంస్థ తీసిన 27 చిత్రాల్లో 90 శాతానికి మించి హిట్లున్నాయి. నా జర్నీ 'సుప్రీమ్‌' నుంచి మొదలైంది. దిల్ రాజు గారికి ఈ ఏడాది సినిమా పరంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు, అదే విధంగా వ్యక్తిగతంగా చేదు జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, దిగమింగుకుని ఈ సెలబ్రేషన్‌ చేస్తున్నందుకు హ్యాపీ. 2017 వెల్కమ్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ శతమానం భవతి, మోటివేషనల్‌ నేను లోకల్‌, వార్మప్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ డీజే, మాన్‌సూన్‌ సూపర్‌డూపర్‌హిట్‌ ఫిదా, అన్‌సీజనల్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ రాజాది గ్రేట్‌, ఫైనల్‌గా ఎంసీఎ. శిరీష్‌గారు రెడ్‌బుల్‌. మా అందరికీ ఎనర్జీ ఇస్తారు'' అని తెలిపారు.

  ఆరు బాల్స్ లో రెండు బాల్స్ నావే

  నాని మాట్లాడుతూ ` ఈ ఏడాది దిల్ రాజు గారు ఆరు బాల్స్ సిక్సర్ కొట్టారు. ఆరు బాల్స్ లో రెండు బాల్స్ ఇచ్చినందుకు థాంక్స్. ఆయన పాషనే ఆయ‌న్ని నెంబ‌ర్ వ‌న్ నిర్మాత‌గా నిలిపింది. ఇది నేను ఇద్ద‌రు వ్య‌క్తుల్లోనే చూశా. ఒక‌టి ఆదిత్య చోప్రా, రెండోది దిల్‌రాజుగారు. ప్ర‌తి చిన్న విష‌యానికీ వారిద్ద‌రూ ఎగ్జయిట్ అవుతారు. నేను ఈ మ‌ధ్య‌నే ప్రొడ‌క్ష‌న్‌లోకి దిగాను. దిగిన త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది ప్రొడ‌క్ష‌న్ ఎంత క‌ష్ట‌మో.. ఒకే ఏడాది ఇన్ని సినిమాలు తీసి అన్ని హిట్లు కొట్టారంటే మీరు గ్రేట్ సార్‌' అని వ్యాఖ్యానించారు.

  నిజ‌మైన మిడిల్ క్లాస్ అబ్బాయి దిల్‌రాజు


  దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``నిజ‌మైన మిడిల్ క్లాస్ అబ్బాయి దిల్‌రాజు. కోటీశ్వ‌రుడైనా, రిక్షావాడైనా అవే సినిమాలు చూడాలి. డిఫ‌రెంట్ క‌ల్చ‌ర్స్, జోన‌ర్స్ సినిమాలు చేస్తున్న రాజుగారికి కంగ్రాట్స్. ఆయ‌న‌తో ప‌నిచేస్తుంటే నిర్మాత‌గా భావించం, ఒక ఫ్యామిలీగా ఫీల‌వుతాం. ఈ ఇయ‌ర్ రాజుగారికి నాకూ క‌లిసి హ్యాట్రిక్ ఉంది. వ‌చ్చే ఏడాది మూడు హ్యాట్రిక్‌లు కొట్టాలి` అన్నారు.

  English summary
  Sri Venkateswara Creations 2017 success celebrations. Dil Raju produced Sathamanam Bhavathi, Duvvada Jaganandham, Nenu Local, Raja The Great, Fida, MCA this year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X