Sachin Tendulkar సచిన్ కెప్టెన్సీలో కప్ కొట్టినందుకే ఆ భయంకర పరిస్థితి.. భలే పంచ్ విసిరిన శ్రీవిష్ణు
RX 100 ఫేమ్ యువ హీరో కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రవీంద్ర (బెన్నీ) బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత వారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం నాడు విజయోత్సవ సభను నిర్వహించింది.ఈ కార్యక్రమానికి యువ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ..
బెదురులంక సినిమాలో యుగాంతం కథ చాలా బాగా నచ్చడమే కాకుండా నాకు బాగా కనెక్ట్ అయింది. దర్శకుడు అజయ్ భూపతి ఊరుకు 40 కిలోమీటర్ల దూరంలో పాసర్లపూడి. 1995 సంవత్సరంలో పాసర్లపూడిలో బ్లో అవుట్ జరిగింది. ఆ సమయంలో మేమంత బతకడం కష్టమనే ఫీలింగ్ కలిగింది.

పాసర్లపూడికి 10 కిలో మీటర్ల దూరంలోనే మా ఊరు. ఆ సమయంలో అక్కడే నేను ఉన్నాను. ఆ మంటలు చూసిన తర్వాత బతకడం కష్టమని అనుకొన్నాను. ఆ విషయాన్ని అజయ్ భూపతి గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని హీరో శ్రీ విష్ణు అన్నాడు.
మేము ఇక బతకడం కష్టమని ఫీలింగ్ కలిగినది 1996 తుఫాన్. ఆ రోజు టైటాన్ కప్ ఫైనల్. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో కొట్టిన ఒకే ఒక కప్. సచిన్ కెప్టెన్సీలో కప్ రావడంతోనే ఆ భారీ పెను తుఫాన్ వచ్చిందని అనుకొన్నాం. అలాంటి విషయాలు గుర్తు చేసినందుకు చాలా హ్యాపీ శ్రీవిష్ణు తెలిపాడు.

బెదురులంక 2012 డైరెక్టర్ క్లాక్స్ నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నేహా శెట్టి తీసుకొన్నామని చెబితే.. నాకు ఆమె పేరు తెలీదు. డీజే టిల్లు సినిమాలో రాధికగా మాత్రమే తెలుసు. బెదురులంక 2012 సినిమాలో ఆమెను చిత్ర అంటున్నారు. ఇలా పాత్రల పేరుతో గుర్తుండేలా నటించడం మామూలు విషయం కాదు అని శ్రీవిష్ణు అభిప్రాయపడ్డారు.
RX 100 సినిమా రిలీజ్ అయిన సమయంలో సోషల్ మీడియాలో నేను చాలా తక్కువగా ఉండేవాడిని. RK 100 మూవీలో పిల్లా రా పాట విని షాక్ అయ్యాను. అందులో కార్తికేయను చూసి ట్వీట్ వేశాను. ఆర్ ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కొత్త కొత్త పాత్రలు చేస్తూనే ఉన్నాడు. పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు బెదురులంకతో హిట్ కొట్టేశాడు. కార్తికేయ నాకు సోదరుడిలాంటి వాడు అని శ్రీవిష్ణు అన్నాడు.

బెదురులంక 2012 సినిమా విషయానికి వస్తే.. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఇండియాలో 7.75 కోట్ల రూపాయల గ్రాస్, 6.6 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8.75 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి. 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ చిత్రం నాలుగో రోజు లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. దాంతో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు.


Click it and Unblock the Notifications











