»   » శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేషన్స్ చిత్రం!

శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేషన్స్ చిత్రం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెకండ్ హ్యాండ్, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రాలతో కధానాయకుడిగా మంచి గుర్తింపు పొందిన శ్రీవిష్ణు ప్రస్తుతం మూడు సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తూ.. బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న నూతన చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ వద్ద ఎడిటింగ్ విభాగంలో పని చేసి, ప్రముఖ దర్శకుడు పరశురాం(బుజ్జి) వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించిన కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు.

Sri Vishnu Movie with Vennela Creations

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల గురించి తెలుపుతూ.. ''స్క్రీన్ ప్లే ప్రధానంశంగా కొనసాగే చిత్రమిది. నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా సరికొత్త కథా కథాంశాలతో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీవిష్ణు నటన అందరిని అలరించే విధంగా ఉంటుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నామని'' తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: తమశ్యామ్, ఆర్ట్: సాయి సురేష్, పాటలు: శ్రీమణి, నిర్మాత: బలగ ప్రకాష్ రావు, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కుమార్.

English summary
Check out details of Sri Vishnu Movie with Vennela Creations.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu