»   » కన్ఫర్మ్‌గా నెక్ట్స్ రేంజ్ హీరోనే.. అబ్బాయిగా ఆదరించండి..

కన్ఫర్మ్‌గా నెక్ట్స్ రేంజ్ హీరోనే.. అబ్బాయిగా ఆదరించండి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, ప్ర‌తినిధి, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌ర‌చితుడైన హీరో శ్రీ విష్ణు క‌థానాయ‌కుడుగా బేబి సాక్షి స‌మ‌ర్ప‌ణ‌లో వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కుమార్ వ‌ట్టి ద‌ర్శ‌క‌త్వంలో బ‌ల‌గ ప్ర‌కాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం మా అబ్బాయి. చిత్రా శుక్లా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ జేఆర్సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగింది. ఎమ్మెల్యే రోజా, మ‌ల్కాపురం శివ‌కుమార్‌, విరించి వ‌ర్మ‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను నారా రోహిత్, నాగ‌శౌర్య విడుద‌ల చేశారు. తొలి సీడీని నారా రోహిత్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా..

చాలా క‌ష్ట‌ప‌డ్డాను.. మీ అబ్బాయిగా ఆశీర్వదించండి

చాలా క‌ష్ట‌ప‌డ్డాను.. మీ అబ్బాయిగా ఆశీర్వదించండి

‘కుమార్ క‌థ చెప్ప‌గానే, పెద్ద క‌థ‌..పెద్ద స్టార్స్‌తో చేసే క‌థ క‌దా..నాతోనే ఎందుకు అని అడిగాను. కానీ న‌న్ను ఎలాగో కుమార్ క‌న్విన్స్ చేసి సినిమా చేశాడు. చిన్న‌ప్పుడు సైనిక స్కూల్‌లాగా క‌ష్ట‌పడ్డాను. డైరెక్ట‌ర్ త‌న అవుట్‌పుట్ కోసం కాంప్ర‌మైజ్ కాలేదు. సురేష్ అద్భుత‌మైన మ్యూజిక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొత్త‌గా అందించాడు. మా అబ్బాయి సినిమాతో తెలుగుకు కొత్త ఫ్లెవ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రావ‌డం ఆనందంగా ఉంది. మా అబ్బాయిగా మీ ముంద‌కు వ‌స్తున్న న‌న్ను మీ అబ్బాయిగా ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను' హీరో శ్రీ విష్ణు అన్నారు.

ప్రకాష్ లాంటి నిర్మాతలు సినీ పరిశ్రమకు అవసరం

ప్రకాష్ లాంటి నిర్మాతలు సినీ పరిశ్రమకు అవసరం

‘శ్రీ విష్ణు తొలి సినిమా `ప్రేమ ఇష్క్ కాద‌ల్` చూసిన‌ప్పుడు త‌న పెర్‌ఫార్మెన్స్ న‌చ్చింది. అప్ప‌టి నుండి డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ, హీరోగా ఎదుగుతున్నాడు. రీసెంట్‌గా `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు. క‌థ న‌చ్చితే ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాని వ్య‌క్తి నిర్మాత ప్ర‌కాష్‌. ఇలాంటి నిర్మాత‌లు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌సరం. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌' అని హీరో సుధీర్ బాబు అన్నారు.

క‌థ‌ను న‌మ్మి సినిమా చేసే నిర్మాత‌

క‌థ‌ను న‌మ్మి సినిమా చేసే నిర్మాత‌

‘మంచి క‌థ‌ను న‌మ్మి ధైర్యంగా సినిమా చేసిన నిర్మాత ప్ర‌కాష్‌రావుకు అభినంద‌న‌లు. శ్రీ విష్ణు చాలా చ‌క్క‌గా న‌టించ‌డంతో పాటు చ‌క్క‌గా డ్యాన్సులు చేశాడు. హీరోయిన్ చిత్ర చాలా అందంగా ఉంది. డైరెక్ట‌ర్ టేకింగ్ బావుంది. ఈ సినిమా హిట్ అయ్యి యూనిట్ అంద‌రూ ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను' అని ఎమ్మెల్యే రోజా అన్నారు.

ఈ సినిమాతో శ్రీ విష్ణు నెక్ట్స్ రేంజ్ హీరో..

ఈ సినిమాతో శ్రీ విష్ణు నెక్ట్స్ రేంజ్ హీరో..

‘‘సోలో‘ సినిమా నుండి నాకు కుమార్ ప‌రిచ‌యం. స్క్రిప్ట్ నాకు తెలుసు. చాలా మంచి స్కిప్ట్‌. శ్రీ విష్ణు నాకు స్నేహితుడు. మంచి ఆర్టిస్ట్‌. త‌ను ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' చిత్రంతో మంచి న‌టుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను. సురేష్ వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత కొత్త‌వాళ్ల‌ను న‌మ్మి సినిమా చేసి, మంచి అవుట్‌పుట్ రావడానికి ముందున్నాడు. ఎంటైర్ టీంకు గుడ్ ల‌క్‌' అని హీరో నారా రోహిత్ అన్నారు.

మా అబ్బాయి సినిమా పెద్ద హిట్ కావాలి

మా అబ్బాయి సినిమా పెద్ద హిట్ కావాలి

‘శ్రీ వష్ణు నిజంగానే మా అబ్బాయి..మాలో ఒక‌డు. మ‌న‌స్ఫూర్తిగా సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమా తీసిన నిర్మాత ప్ర‌కాష్‌కు, డైరెక్ట‌ర్ కుమార్ స‌హా అంద‌రికీ మంచి పేరుతో పాటు లాభాలు రావాల‌ని కోరుకుంటున్నాను' హీరో నాగ‌శౌర్య అన్నారు.

నిర్మాతకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను

నిర్మాతకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను

‘ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్తాండ్ కె.వెంక‌టేష్‌గారి వ‌ద్ద వ‌ర్క్ చేశాను. ఆయ‌న ద‌గ్గ‌ర వర్క్ చేయ‌డం వ‌ల్ల సినిమా ఎలా చేయాలో నేర్చుకున్నాను. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. కథ విని న‌చ్చి సినిమా చేసిన నిర్మాత ప్ర‌కాష్‌రావుకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. థ‌మ‌ శ్యామ్ చాలా మంచి సినిమాటోగ్ర‌ఫీ అందించాడు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. చిత్ర చాలా చ‌క్క‌గా న‌టించింది. సోలో సినిమాలో ఒక్క డైలాగ్‌లో న‌టించిన శ్రీవిష్ణును చూసి మీరు పెద్ద హీరో అవుతార‌ని చెప్పాను. అప్ప‌టి నుండి నాకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. త‌ను ఈ పాత్ర‌లో ఎంత బాగా చేశాడంటే ఈ పాత్ర‌కు త‌ను త‌ప్ప వేరేవ‌రూ సూట్ కాలేర‌నేలా చేశాడు. నాకు మంచి టీం కుదిరింది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌' అని ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి అన్నారు.

మంచి సినిమా... ఆశీర్వ‌దించండి

మంచి సినిమా... ఆశీర్వ‌దించండి

‘ఏదో తెలియ‌ని ఉత్సాహం, సంతోషం, ఉద్వేగంగా ఉంది. ఎక్క‌డో శ్రీకాకుళంలో మారుమూల పుట్టిన నేను ఈ రోజు సినిమా ఇండ‌స్ట్రీలో సినిమా చేయ‌డంతో ఏదో సాధించానని అనుకుంటున్నాను. ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌గానే సినిమా చేయ‌గ‌లుగుతాడా అనిపించింది. కానీ వ‌ట్టి కుమార్ తాను గ‌ట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు. హీరో శ్రీవిష్ణు అద్భుతంగా న‌టించాడు. త‌ను భ‌విష్య‌త్‌లో పెద్ద హీరోగా ఎదిగాడు. అలాగే చిత్రా శుక్లా న‌ట‌నే కాదు, చ‌క్క‌గా డ్యాన్స్ కూడా చేశాడు. థమ‌శ్యామ్ మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. మంచి సినిమా చేశామ‌ని న‌మ్ముతున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం' అని నిర్మాత బ‌ల‌గం ప్ర‌కాష్ రావు అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మార‌డానికి కార‌ణం..

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మార‌డానికి కార‌ణం..

‘నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు కుమార్‌, నిర్మాత ప్ర‌కాష్‌కు థాంక్స్‌. ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' సినిమా స‌మ‌యంలో నాకు రీ రికార్డింగ్ చేసే అవ‌కాశం ఇచ్చిన శ్రీ విష్ణుగారికి థాంక్స్‌. ఆయ‌న స‌పోర్ట్‌తో పాటు, వేణు అన్న కార‌ణంగానే ఈ సినిమాకు మ్యూజిక్ చేయ‌గ‌లిగాను. ద‌ర్శ‌కుడు కుమార్‌ స్ట‌యిల్ చూస్తుంటే తొలి సినిమా డైరెక్ట‌ర్‌లా అనిపించ‌లేదు. వినాయ‌క్ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ చేసిన‌ట్లు అనిపిపించింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా చూసి అంద‌రూ ఎంక‌రేజ్ చేయండి' అని మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి అన్నారు.

మా అబ్బాయి సీన్లు అద్భుతం..

మా అబ్బాయి సీన్లు అద్భుతం..

‘నిర్మాత ప్ర‌కాష్‌ నాకు సినిమాలో కొన్ని సీన్స్‌ను చూపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. తెర‌పై శ్రీవిష్ణు హీరో అయితే తెర వెనుక ప్ర‌కాష్‌రావుగారే హీరో. ఇలాంటి నిర్మాత‌లు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. ఈ సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను' నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ అన్నారు.

సురేశ్ బొబ్బిలి సంగీతంతో..

సురేశ్ బొబ్బిలి సంగీతంతో..

శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌శ్యామ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన చిత్రానికి మార్తాండ్ కే వెంక‌టేష్ ఎడిటింగ్ భాద్యతలను నిర్వర్తించారు. పాట‌లు కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి రాశారు.

English summary
After Appatlo Okadunde Vadu, Hero Sri Vishnu coming with Ma Abbayi. Ma Abbayi Audio realeased Tuesday in Hyderabad.
Please Wait while comments are loading...