twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sridevi 3rd death anniversary.. దివికేగిన అతిలోక సుందరి.. ఇంకా వీడని విషాదం!

    |

    భారతీయ సినీ పరిశ్రమ వెండితెరపై అతిలోక సుందరిలా విరాజిల్లిన అందాల తార శ్రీదేవి ఇక లేరన్న వార్త మూడేళ్ల క్రితం సినీ ప్రపంచాన్ని గుండె పగిలేలా చేసింది. ఆమె ఆకాల మరణంతో యావత్తు సినీ పరిశ్రమ, ప్రేక్షకులు విషాదంలో మునిగిపోయారు. శ్రీదేవి ఈ లోకాన్ని వీడి మూడేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నారు. శ్రీదేవి 3వ వర్ధంతి సందర్బంగా మరోసారి వెండితెర దేవతను స్మరించుకొంటూ..

    ఐదు దశాబ్దాల కెరీర్‌లో

    ఐదు దశాబ్దాల కెరీర్‌లో

    దేశ సినీ చరిత్రలో సుమారు ఐదు దశాబద్దాల శ్రీదేవి ప్రస్థానం అపూర్వం, అద్భుతం. తెలుగు, తమిళం, హిందీ సినీ పరిశ్రమలో ఆమె నటించిన చిత్రాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొన్నాయి. ఆమె చివరి శ్వాస వరకు సూపర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు.

    1967లో తమిళ చిత్రంతో

    1967లో తమిళ చిత్రంతో

    శ్రీదేవీ నట జీవితం 1967లో తమిళ చిత్రం కాందాన్ కురుణై చిత్రంతో మొదలైంది. అప్పటి నుంచి చివరి క్షణం వరకు పలు భాషల్లో 300 చిత్రాలకుపైగా నటించారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న శ్రీదేవి.. సెకండ్ ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ వింగ్లీష్ ప్రారంభించారు. ఆ తర్వాత తమిళ చిత్రం పులి, మామ్ చిత్రాల్లో నటించారు. షారుక్ ఖాన్ చిత్రం జీరోలో అతిథి పాత్రలో మెరిసారు.

    తెలుగులో చరిత్ర సృష్టించిన శ్రీదేవీ

    తెలుగులో చరిత్ర సృష్టించిన శ్రీదేవీ

    తెలుగులో పదహారేళ్ల వయసు, వజ్రాయుధం, వేటగాడు, బొబ్బిలిపులి, కార్తీకదీపం, సర్దార్ పాపారాయుడు, ఆకలిరాజ్యం, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, జస్టిస్ చౌదరీ, దేవత, జగదేక వీరుడు అతిలోక సుందరి, గోవిందా గోవిందా, ఎస్పీ పరుశురాం, క్షణక్షణం తదితర చిత్రాలు చరిత్ర సృష్టించాయి.

    హిందీలో సూపర్‌స్టార్‌గా

    హిందీలో సూపర్‌స్టార్‌గా

    ఇక హిందీలో సద్మా, చాందీని, తోఫా, జుదాయి, లాడ్లా, జాన్ బాజ్, కర్మ, నగీనా, ఛాల్‌బాజ్, లమ్హే, మిస్టర్ ఇండియా, మామ్, ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి చిత్రాలతో హిందీ చిత్ర సీమను శాసించారు. సెకండ్ ఇన్నింగ్స్ జోరుందుకొనే సమయంలో ఆమె ఈ లోకాన్ని వీడటం అందర్నీ దు:ఖసాగరంలో ముంచెత్తింది.

    దుబాయ్‌లో పెళ్లి కోసం వెళ్లి మృత్యువాత

    దుబాయ్‌లో పెళ్లి కోసం వెళ్లి మృత్యువాత

    దుబాయ్‌లో పెళ్లి కోసం వెళ్లిన శ్రీదేవి మృత్యువాత పడ్డారు. 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె ప్రమాదవశాత్తూ బాత్రూంటబ్‌లో మునిగి కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు 54 సంవత్సరాలు. ఆమె మరణ వార్తతో యావత్ సినీ ప్రపంచం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అనూహ్యంగా దివికేగిన అతిలోక సుందరి ఆత్మకు శాంతి కలుగాలని ఆశిద్దాం.

    English summary
    Sridevi 3rd death anniversary: Indian super star Sridevi passed away on February 24, 2018. Her death was happened accidentally at dubai. she was attended a marriage. Unfortunately She drowning in dubai hotel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X