twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'మగధీర'గురించి శ్రీదేవి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆ మధ్య మావారు 'మగధీర' డీవీడీ తీసుకొచ్చారు. చిరంజీవి అబ్బాయి రామ్‌చరణ్‌ చాలా బాగా చేశాడు. కాజల్‌ నటన కూడా నాకు బాగా నచ్చింది అంటూ శ్రీదేవి రామ్ చరణ్ ని మెచ్చుకున్నారు. నిజ జీవితంలో ఇల్లాలి పాత్రని పోషిస్తున్న ఆమె చాలా కాలం గ్యాప్ తర్వాత 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' కోసం మళ్లీ మేకప్‌ వేసుకొన్నారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి హైదరాబాద్‌ వచ్చి మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.

    అలాగే 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' రీమేక్‌ గురించి చిత్రసీమలో చర్చ నడుస్తోంది. ఆ సినిమాలో మీ అమ్మాయి జాహ్నవి నటించే అవకాశాలు ఉన్నాయా అని అడిగితే..అవునా? ఆ విషయం నాకు ఇంతవరకూ తెలీదు. ఈ ప్రస్తావన నా దగ్గరకు ఎవరూ తీసుకురాలేదు అని తేల్చి చెప్పారు. ఇక తనకు ఈ మధ్య కాలంలో నచ్చిన హీరోయిన్స్ గురించి చెపుతూ...అందరూ బాగానే చేస్తున్నారు. తమన్నా నటించిన తమిళ సినిమాలు చూశా. ఆ అమ్మాయి చాలా బాగుంది. నృత్యాలు కూడా బాగా చేస్తోంది అని చెప్పారు.

    చాలా కాలం తరవాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు... ఎలా అనిపిస్తోంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ...నేనేదో సినిమాలకు దూరమయ్యానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికీ ఆ వాతావరణం కనిపిస్తుంది. మా ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆ కథలు నేనూ వింటుంటాను. అందుకే పెద్ద విరామం వచ్చిందని అనిపించలేదు. ఆదివారం సెలవు తీసుకొని మళ్లీ సోమవారం సెట్‌కి వచ్చినట్టే ఉంది అని తేల్చి చెప్పారు.

    'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌'సినిమా గురించి చెపుతూ...దర్శకురాలు గౌరి... 'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌' కథ చెప్పగానే ఒప్పుకొన్నారట కదా...అవును. నా మనసుకి అంతలా నచ్చింది. ఇందులో ఓ సామాన్య గృహిణిలానే కనిపిస్తాను. భాష రాకపోతే.. ఎన్ని సమస్యలొస్తాయి అనే విషయాన్ని వినోదం జోడించి చెప్పారు. నా జీవిత అనుభవాలు కూడా పనికొచ్చాయి. ఎందుకంటే నేను భాష తెలియని చోట కూడా పనిచేశాను. అప్పుడూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నా అన్నారు.

    English summary
    English Vinglish is an upcoming Indian drama film directed by debutant director Gauri Shinde and produced by R. Balki. The film marks the comeback of Sridevi after a 14 year sabbatical. The film also features French actor Mehdi Nebbou, Adil Hussain, and Priya Anand. Amitabh Bachchan makes a guest appearance in the Hindi version of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X