శ్రీదేవి అమెరికా ప్రయాణం సీక్రెట్!?
జగదేక సుందరి శ్రీదేవి త్వరలో అమెరికా వెళ్ళటానికి ప్రిపేరవుతోంది. హఠాత్తుగా ఆమె అమెరికా ప్రయాణం ఎందుకంటే..ఇంగ్లీష్ నేర్చుకోవటానకి అని తెలుస్తోంది. అదేంటి శ్రీదేవి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది కదా అంటే..ఆమె చేయబోయే చిత్రం ఇంగ్లీష్ బాషకు చెందిన కామిడీ. అందుకే ఆమె ఇంగ్లీష్ అందునా అమెరికన్ శ్లాంగ్ నేర్చుకుని మరీ వస్తుందిట. ఇక ఈ చిత్రం టైటిల్ ఇంగ్లీష్ వింగ్లీష్. బాల్కీ భార్య గౌరీ షిండే శ్రీదేవి సినిమాకు దర్శకత్వం వహించనుంది. ఈ ఇక ఈ సినిమాలో శ్రీదేవిదే మేయిన్ రోల్.వచ్చి రానీ ఇంగ్లీష్ తో అష్టకష్టాలు పడేలా ఆమె పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ద్వారా ఇంగ్లీష్ వ్యాఖ్యాల్లో దాగి ఉన్న హాస్యాన్ని పండించనున్నారు. అందుకే ఇంగ్లీష్ లో పట్టుసాధించేందుకు ఆమె అమెరికా వెళ్లనునుంది.అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని,శ్రీదేవి పర్శనల్ పనిమీద అమెరికా వెళ్తూంటే దీనకి ముడివేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











