»   » ఆ హిట్ మూవీ సీక్వెల్‌లో శ్రీదేవి, అమితాబ్!(ఫోటో ఫీచర్)

ఆ హిట్ మూవీ సీక్వెల్‌లో శ్రీదేవి, అమితాబ్!(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరోసారి కలిసి నటించబోతున్నట్లు సమాచారం. 1992లో వచ్చిన బాలీవుడ్ హిట్ మూవీ 'ఖుదా జవా' చిత్రం సీక్వెల్‌లో నటించడానికి ఇద్దరు యాక్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు బాలీవుడ్లో చర్చ సాగుతోంది.

'ఖుదా జవా సీక్వెల్‌కు స్క్రిప్టు వర్క మొదలైంది. అప్పట్లో ఆ చిత్రం అందరినీ మెప్పించింది. అందుకే స్వీక్వెల్ ప్లాన్ చేసాం. ఇప్పటికే స్వీక్వెల్ కాన్సెప్టు గురించి అమితాబ్ బచ్చన్‌కు చెప్పాం. ఆయన నుంచి పాసిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. స్ర్కిప్టు వర్క్ పూర్తయిన తర్వాత ఆయన్ను మళ్లీ సంప్రదిస్తాం' అని నిర్మాత మనోజ్ దేశాయ్ తెలిపారు.

'స్క్రిప్టు వర్కు పూర్తయిన తర్వాత అమితాబ్ జీ ఒప్పుకుంటే....శ్రీదేవిని కూడా సంప్రదించే అవకాశం ఉంది. యంగ్ జనరేషన్‌కు సంబంధించిన యాక్టర్ల ఎంపిక స్క్రిప్టు వర్కు పూర్తయిన తర్వాతే జరుగుతుంది' అని నిర్మాత స్పష్టం చేసారు. త్వరలో పూర్తి వివరాలు తెలియపరుస్తామని తెలిపారు. స్టోరీలైన్ ఎలా ఉంటుంది అనే విషయం చెప్పడానికి నిర్మాత నిరాకరించారు.

1992లో వచ్చిన 'ఖుదా జవా' చిత్రం ఆఫ్ఘనిస్థాన్, ఇండియా నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో ఈ చిత్రం రెండు దేశాల్లోనూ మంచి విజయం సాధించింది. స్క్రిప్టు వర్కు పూర్తయి సీక్వెల్ షూటింగ్ 2014లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. శ్రీదేవి రీ ఎంట్రీ మూవీ 'ఇంగ్లిష్ వింగ్లిష్'లో అమితాబ్ నటించారు, కానీ ఆయన కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేసారు.

ఇన్‌క్విలాబ్

ఇన్‌క్విలాబ్


1984లో టి.రామారావు దర్శకత్వంలో వచ్చిన ఇన్‌క్విలాబ్ చిత్రంలో శ్రీదేవి, అమితాబ్ తొలిసారి కలిసి నటించారు. ఇదొక పొలిటికల్ డ్రామా మూవీ.

ఇతర చిత్రాలు

ఇతర చిత్రాలు


ఆ తర్వాత అమితాబ్-శ్రీదేవి ‘ఆఖ్రీ రాస్తా' అనే థ్రిల్లర్ మూవీలో కలిసి నటించారు. ఈ చిత్రంలో జయప్రద కూడా నటించారు. ఆ తర్వాత ‘జోమ్మా చుమ్మా ఇన్ లండన్', ‘ఇంగ్లిష్ వింగ్లిష్', ‘బాంబే టాకీస్' చిత్రాల్లో నటించారు.

ఖుదా గవా

ఖుదా గవా


ఖుదా గవా చిత్రం ఎపిక్ డ్రామా చిత్రం. ఈచిత్రానికి ముకుల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసారు.

అవార్డులు

అవార్డులు


1992లో విడుదలైన ఖుదా గవా చిత్రం ఆ సంవత్సరం కలెక్షన్ల పరంగా సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి అనేక అవార్డులు కూడా దక్కాయి.

సీక్వెల్

సీక్వెల్


1992లో వచ్చిన ఖుదా గవా చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మరి సీక్వెల్ లోనూ ఇద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు ఉంటాయో? లేదో?

English summary
Bollywood megastar Amitabh Bachchan and Sridevi are likely to unite again on screen for the sequel of their hit 1992 film Khuda Gawah.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu