twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెరుపుతీగ శ్రీదేవి మళ్ళీ మన ముందుకు

    By Staff
    |

    కుర్రకారు కలల రాణిగా శ్రీదేవి. నటిగా వెండితెరకి దూరమైన తర్వాత కూడా అభిమానుల గుండేల్లో ఆ స్థానం పదిలంగా ఉంది ఆమెకు. అర్ధ సెంచరీకి దగ్గర పడుతున్నా ఆ వయస్సు తాలూకు ఛాయలు తనతో ఇసుమంతైనా కనిపించవు. శరీరాకృతిని అంత చక్కగా కాపాడుకుంటున్నారు ఆమె. మళ్లీ శ్రీదేవి సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న నటి నటీమనుల కాంపిటీషన్ లో శ్రీదేవి తన రెండవ ఇన్నింగ్స్ తో త్వరలో మన ముందుకు రాబోతున్నది. ఆ కోరిక తర్వలో నెరవేరే అవకాశం ఉందనుకోవచ్చు.

    గతంలో రజనీకాంత్, అమల జంటగా రూపొందిన తమిళ చిత్రం 'మాప్పిళ్లై" ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా పునర్నిర్మించాలనుకుంటున్నారు. అల్లుడు, అత్తకీ మధ్య జరిగే పోరుతో ఈ చిత్రం సాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏటంటే దేశముదురు హీరోయిన్ క్యూట్ గర్ల్ హన్సికా మోత్వాని శ్రీదేవి కూతురుగా నటించబోతున్నారు. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలని మరి.

    దేశముదురు తర్వాత హన్సికాకు మంచి అవకాశాలు రావడం విశేషం. ఇంత బ్యూటిఫుల్, గ్లామరస్ శ్రీదేవి గారికి కూతురుగా నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందటున్నారు హన్సిక. అత్త పాత్ర కీలకం కాబట్టి ఖుష్బూ, సిమ్రాన్లను అడిగారనే వార్త ఇటీవల వచ్చింది. వేరు వేరు కారణాల వల్ల ఈ ఇద్దరూ అంగీకరించలేదల. దాంతో అతిలోక సుందరి శ్రీదేవిని అడిగారని తాజా సమాచారం. పొగరుబోతు అత్తగా నటించడానికి శ్రీదేవి కూడా పచ్చజెండా ఊపారట. అదే నిజం అయితే అభిమానులకు ఖచ్చితంగా ఇది ' స్వీట్ న్యూసే" అని చెప్పొచ్చు"

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X