హైదరాబాద్‌లో.. అతిలోక సుందరి శ్రీదేవి
కథ బాగా నచ్చి, తనకు సూటవ్వడం వల్లనే ఈ సినిమా చేస్తున్నానని, రీ ఎంట్రీపై ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా జరుగుతోందని...నిర్మాత బాల్కీ, దర్శకురాలు గౌరీ వచ్చి కథ చెప్పి నన్ను ఒప్పించారని వెల్లడించారు. హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని, తను నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉందన్నారు. కథలు నచ్చి, నాకు సెట్టయితే మరిన్ని సినిమాలు చేస్తానని శ్రీదేవి తెలిపారు. తన కూతురు జాహ్నవి సినీ రంగం ఎంట్రీ గురించి ప్రశ్నించగా...నేనే ఇప్పుడు మళ్లీ కొత్తగా సినీరంగంలోకి అడుగు పెడుతున్నాను, జాహ్నవి గురించి ఇంకా ఏమీ ఆలోచించ లేదని శ్రీదేవి స్పష్టం చేసారు.
ఈ చిత్రంలో అమితాబ్, అజిత్ అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.


Click it and Unblock the Notifications












