సెక్సీ లుక్ : శ్రీదేవి డాన్స్ అదిరింది (ఫోటోలు)
హైదరాబాద్ : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ((IIFA) అవార్డుల కార్యక్రమం ఇటీవల మకావులో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి చాలా కాలం తర్వాత స్టేజీ పెర్పార్మెన్స్ ఇచ్చి అదరగొట్టింది. అంతేకాదు ఈ వయసులోనూ సెక్సీ లుక్‌తో ఆకట్టుకుంది.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డుల కార్యక్రమానికి శ్రీదేవి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఆకట్టుకునే డ్రెస్సింగుతో జాన్వి అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది.
శ్రీదేవి జోరు చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. IIFA అవార్డుల కార్యక్రమంలో శ్రీదేవి సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో కలిసి శ్రీదేవి స్టేజి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

త్వరలో శ్రీదేవి ప్రముఖ టెలివిజ్ షో ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాగా ప్రజాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి' షో తెలుగు వెర్షన్ శ్రీదేవి ద్వారా ప్రారంభం కాబోతోందని అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ త్వరలో హీరోయిన్ గా వెండితెర అరంగ్రేటం చేయనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగిన విధంగా వివిధ కార్యక్రమాల్లో జాన్వి కపూర్ ఆటిట్యూడ్ ఉండటం గమనార్హం.

ఇప్పటికే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో ఓ ఫ్రాంచైజీ సొంతం చేసుకుని సినిమా రంగంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న శ్రీదేవి...ఇక బుల్లితెరపై తన సత్తా చాటాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే తెలుగులో ‘కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో భార్య శ్రీదేవి, పిల్లలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్


Click it and Unblock the Notifications











