twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదీ శ్రీదేవి అంటే.... ఆ వివాదంలో తలదించుకున్న రాజమౌళి!

    By Bojja Kumar
    |

    ఇండియన్ సినిమా చరిత్రలో ఓ అద్భుతం 'బాహుబలి' ప్రాజెక్టు. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సిరీస్ దాదాపు రూ. 2 వేల కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర శివగామి కోసం తొలుత శ్రీదేవిని సంప్రదించారు. అయితే పలు కారణాలతో ఆమె తిరస్కరించడం, ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కడం తెలిసిందే. అయితే బాహుబలి విడుదలైన భారీ విజయం సాధించిన తర్వాత రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి ప్రస్తావన తేవడం, రహస్యంగా ఉంచాల్సిన వివరాలు బయట పెట్టడం వివాదాస్పదం అయింది. అయితే ఈ ఇష్యూపై శ్రీదేవి హుందాగా స్పందించి..... రాజమౌళి తలదించుకునేలా చేశారు.

    Recommended Video

    హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!
    టంగ్ స్లిప్ అయిన రాజమౌళి

    టంగ్ స్లిప్ అయిన రాజమౌళి

    ఏదైనా సినిమా ఒప్పుకోవాలా? వద్దా? అనేది ఆయా నటీనటుల ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కథ నచ్చక పోయినా, పాత్ర నచ్చక పోయినా, లేదా వారికి ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ నచ్చక పోయినా.... తిరస్కరించడం వారి హక్కు. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఇవన్నీ అంతర్గత విషయాలు. దర్శక నిర్మాతలు కూడా.... ఎవరైనా హీరో లేదా హీరోయిన్‌ను సంప్రదించినపుడు జరిగిన ఈ అంతర్గత విషయాలను బయట పెట్టరు... పెట్టకూడదు కూడా. అయితే ఆ సమయంలో విజయగర్వమో? ఏమో? రాజమౌళి టంగ్ స్లిప్ అయ్యారు. శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో పడ్డారు.

    రాజమౌళి ఆ విషయాలు చెప్పి ఉండకూడదు

    రాజమౌళి ఆ విషయాలు చెప్పి ఉండకూడదు

    శివగామి పాత్ర చేయాలని శ్రీదేవి గారిని స్పందించిపుడు ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని, రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు ఆమె షూటింగుకు వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్ టిక్కెట్లు, బిగ్గెస్ట్‌ హోటల్‌లో 5 సూట్లు... ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. రహస్యంగా ఉంచాల్సిన ఈ విషయాలు రాజమౌళి బయట పెట్టి తప్పు చేశానే విమర్శలు అప్పట్లో వినిపించాయి.

    రాజమౌళి కామెంట్లకు బాధ పడిన శ్రీదేవి

    రాజమౌళి కామెంట్లకు బాధ పడిన శ్రీదేవి

    తన వెల్ విషెర్స్ రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లింక్ ను పంపితే దాన్ని చూసి షాక్ అయ్యానని, ఎంతో బాధపడ్డానని శ్రీదేవి అప్పట్లో ఓ తెలుగు టీవీ చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

    హుందాగా వ్యవహరించిన శ్రీదేవి

    హుందాగా వ్యవహరించిన శ్రీదేవి

    రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని, ఆయన దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం అద్భుతమని చెప్పిన శ్రీదేవి.... అలాంటి దర్శకుడు తన గురించి అలా మాట్లాడటం పద్దతిగా అనిపించలేదని, మనసుకు బాధ కలిగించిందని చెప్పారు. పబ్లిక్ ప్లాట్ ఫాంపై చెప్పడం, ఇలా మాట్లాడటం మంచి పద్ధతి అనిపించుకోదు అన్నారు. రాజమౌళికి తన గురించి నిర్మాతలు తప్పుగా చెప్పి ఉంటారేమోనని శ్రీదేవి అభిప్రాయ పడ్డారు. అలాంటి గొంతెమ్మ కోరికలు కోరి ఉంటే 300 సినిమాలు చేసేదాన్ని కాదు, 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు అని ఆమె అన్నారు.

    తలదించుకున్న రాజమౌళి

    తలదించుకున్న రాజమౌళి

    రాజమౌళి డిగ్నిఫైడ్ దర్శకుడని అనుకున్నా. బాహుబలి లాంటి సినిమా తీసినందుకు రాజమౌళిని అభినందిస్తున్నానని, ఆయన ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నానని అన్నారు శ్రీదేవి అన్నారు. శ్రీదేవి నుండి అలాంటి రియాక్షన్ రావడంతో....తాను ఆ కామెంట్స్ చేసి ఉండకూడదు అని రాజమౌళి తలదించుకున్నారని, పశ్చత్తాపడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి.

    శ్రీదేవి మరణం తీరని లోటు

    శ్రీదేవి మరణం తీరని లోటు

    కాగా.....శ్రీదేవి మరణం ఇండియన్ సినీ పరిశ్రమకు తీరని లోటు అని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

    English summary
    Sridevi Upset with Rajamouli's Controversial Comments. Few months back Speaking to Ntv, Saridevi said she was hurt by Rajamouli's alleged comment that he was happy that she didn't do the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X