ఆ విషయంలో ఎన్టీఆర్ తడబాటు..శ్రీదేవి అండతో రెచ్చిపోయారు!

తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా శ్రీదేవి కోట్లాది అభిమానులని సంపాదించుకుంది. పలు భాషలో శ్రీదేవి వందలాది చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగారు. కానీ టాలీవుడ్ లో శ్రీదేవి నటించిన కొన్ని చిత్రాలు ఎప్పటికి ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ వంటి లెజెండ్స్ మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో కూడా అతిలోక సుందరి ఆడిపాడింది. నటన, అందం మాత్రమే కాదు ఈ తరానికి తగ్గట్లుగా నాట్యంతో మెప్పించడంలో కూడా శ్రీదేవి దిట్ట. బడా సస్టార్స్ సరసన చేసిన నృత్యాలు ఇప్పటికీ తెలుగుప్రేక్షకుల కళ్ళముందు మెదులుతూనే ఉంటాయి.

Recommended Video

SR NTR A Great Fan Of Sridevi
 తెలుగులో తొలిచిత్రం

తెలుగులో తొలిచిత్రం

శ్రీదేవి తెలుగులో నటించిన తొలి చిత్రం మా నాన్న నిర్దోషి. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీదేవి బాలనటిగా పరిచయం అయింది.

 పదహారేళ్ళ వయసుతోనే మనసు దోచింది

పదహారేళ్ళ వయసుతోనే మనసు దోచింది

శ్రీదేవి తొలిసారి తెలుగులో హీరోయిన్ గా నటించిన చిత్రం పదహారేళ్ళ వయసు. అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న కుర్ర భామగా శ్రీదేవి అందరి హృదయాల్ని కొల్లగొట్టేసింది.

 డాన్సుల ప్రభావం మొదలైంది

డాన్సుల ప్రభావం మొదలైంది

70 దశకం చివరి నుంచి శ్రీదేవి హవా టాలీవడో లో మొదలైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్సుల ప్రభావం ఎక్కువవుతున్న రోజులు అవి. ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలు వారికి తోచిన విధంగా డాన్సులతో అలరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు డాన్సలకు అప్పుడే బాగా అలవాటు పడ్డారు.

 వెనుకబడ్డ ఎన్టీఆర్

వెనుకబడ్డ ఎన్టీఆర్

నటనలో ఎన్టీఆర్ కు తిరుగులేదు. కానీ అప్పట్లో ఆయన ఎన్నార్ డాన్సులలోని జోరుని అందుకోలేక వెనుకబడ్డారు.

 శ్రీదేవి తొలిసారి

శ్రీదేవి తొలిసారి

అప్పటికే ఎన్టీఆర్‌కు మానవరాలిగా నటించిన శ్రీదేవి, 1979 లో వచ్చిన వేటగాడు చిత్రంతో ఆయనకు హీరోయిన్ గా మారిపోయింది. ఆ చిత్రంలో డాన్సులకు ప్రాధాన్యత ఉంది.

 ఎన్టీఆర్ రెచ్చిపోయారు

ఎన్టీఆర్ రెచ్చిపోయారు

డాన్సు మాస్టర్స్ చెబుతున్న స్టెప్పులు పట్ల ఎన్టీఆర్‌కు ఆసక్తి ఉండేది కాదట. ఆ స్టెప్పులని ఆయన కష్టంగా భావించేవారు. కానీ శ్రీదేవి మాయ చేసింది. ఎన్టీఆర్ కు డాన్సుల విషయంలో సలహాలు సూచనలు ఇచ్చింది. చిన్నపాటి స్టెప్పులు కూడా నేర్పించింది. శ్రీదేవి ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్టీఆర్ రెచ్చిపోయారు.

ఆకుచాటు పిందె తడిచే.. మరచిపోగలమా

ఆకుచాటు పిందె తడిచే.. మరచిపోగలమా

1979 లో వచ్చిన వేటగాడు చిత్రం ఓ సెన్సేషన్. అప్పట్లోనే ఆ చిత్రం రికార్డు విజయం సాధించింది. శ్రీదేవి అందాలు,ఎన్టీఆర్ స్టెప్పులు తెలుగువారిని ఉర్రుతలూగించాయి. ఆకుచాటు పిందె తడిచే అనే సాంగ్ లో ఎన్టీఆర్, శ్రీదేవి పెర్ఫామెన్స్ ఒక ఊపు ఊపింది. ఆ పాటలో శ్రీదేవి తడి అందాలకు యువత ఫిదా అయిపోయారు.

 వరుసగా సూపర్ హిట్లు

వరుసగా సూపర్ హిట్లు

వేటగాడు చిత్రం నుంచి ఎన్టీఆర్‌కు శ్రీదేవి గురువుగా మారిపోయింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. డాన్సుల విషయంలో శ్రీదేవి తనకు గురువు అని ఎన్టీఆర్ అప్పట్లో ప్రశంసలు కురిపించారు. ఆ తరువాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి.

 నీ కళ్ళు చెబుతున్నాయి అంటూ ఏఎన్నార్ తో

నీ కళ్ళు చెబుతున్నాయి అంటూ ఏఎన్నార్ తో

శ్రీదేవి ఎన్నార్ తో కలసి పలు చిత్రాల్లో కటించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమాభిషేకం చిత్రం ఓ చరిత్ర. ఆ చిత్రంలో నీ కళ్ళు చెబుతున్నాయి అనే పాటలో ఈ జంట నృత్యాలు బాగా అలరించాయి.

 మెగాస్టార్ సినిమా కోసం దిగివచ్చిన అతిలోక సుందరి

మెగాస్టార్ సినిమా కోసం దిగివచ్చిన అతిలోక సుందరి

అప్పటికే శ్రీదేవి తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో శ్రీదేవి చేసిన మాయ అంతా ఇంతా కాదు. ఆచిత్రంలో శ్రీదేవి పాత్ర దేవకన్య. నిజంగా ఆచిత్రం కోసమే శ్రీదేవి స్వర్గం నుంచి దిగివచ్చిందా అనేంతగా శ్రీదేవి ఆ చిత్రంలో ఒదిగిపోయింది. ఆ చిత్రం దృశ్య కావ్యంగా రికార్డులని తిరగరాసింది.

 అబ్బని తియ్యని దెబ్బ అంటూ సమ్మోహన మంత్రం

అబ్బని తియ్యని దెబ్బ అంటూ సమ్మోహన మంత్రం

జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం కూడా పెద్ద ప్లస్ పాయింట్. ఇళయరాజా స్వరపరిచిన అబ్బని తీయని దెబ్బ పాట ఒక ఎత్తైతే.. శ్రీదేవి, చిరంజీవి జంట మరో ఎత్తు. పాటకు తగ్గట్లుగా లయబద్దంగా శ్రీదేవి, చిరు చేసిన డాన్సులు చరిత్రాత్మకం అని చెప్పుకోవచ్చు.

 నాగార్జున, వెంకటేష్ తో కూడా

నాగార్జున, వెంకటేష్ తో కూడా

ఎన్నార్, ఎన్టీఆర్ తో ఆడిపాడిన శ్రీదేవి రెండవతరం హీరోలు నాగార్జున, వెంకటేష్ తో కూడా నటించింది. నాగార్జున చితో నటించిన ఆఖరి పోరాటం చిత్రం ఘనవిజయాన్ని అందుకోగా, వెంకీ క్షణ క్షణం చిత్రం అలరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X