హిమ్మత్‌వాలాతోనే శ్రీదేవికి స్టార్‌డమ్: సాజిద్
పాత హిమ్మత్‌వాలా సినిమాలో జితేంద్ర, శ్రీదేవి జంటగా నటింటారు. రీమేక్‌లో అజయ్ దేవగన్, తమన్నా నటించారు. శ్రీదేవితో తనకు వ్యక్తిగత పరిచయం లేదని, దాంతో చిత్రం గురించి ఆమెతో మాట్లాడలేదని ఆయన అన్నారు. హిమ్మత్‌వాలా రీమేక్ షూటింగ్‌కు రెండు రోజుల ముందు జితేంద్రతో విషయం చెప్పానని అన్నారు. చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తున్నందుకు జితేంద్ర ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు.
జితేంద్ర తనను దీవించారని ఆయన చెప్పారు. తన హిమ్మత్‌వాలా సినిమాను రీమేక్ అని కాకుండా రీరైట్ అని పిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన టాప్ ఐదు అభిమాన బాలీవుడ్ సినిమాల్లో హిమ్మత్‌వాలా ఒకటని ఆయన అన్నారు. ఈ సినిమాతో తన పేరు చేరింనందుకు ఆనందంగా ఉందని సాజిద్ ఖాన్ అన్నారు.
పాత సినిమాలోని సారాన్ని తీసుకుని పూర్తిగా తిరిగి రాసుకున్నామని, యథాతథంగా చిత్రీకరించలేదని, ట్రీట్‌మెంట్ భిన్నంగా ఉందని చెప్పారు. ప్రేక్షకులు పాత సినిమాలను చూస్తారా అని అడిగితే సమాధానం దాటేస్తూ మోలోడ్రామాను ఏక్తా కపూర్ సజీవంగా ఉంచారని అన్నారు. ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications












