శ్రీదేవి మృతదేహం తరలింపునకు గ్రీన్ సిగ్నల్.. బోని అరెస్ట్‌పై వీడిన ఉత్కంఠ.. దుబాయ్‌లో అర్జున్‌కపూర్.

By Rajababu

Recommended Video

Sridevi's Last Rites : Sridevi's Body To Reach Mumbai By Evening

దుబాయ్‌లో శ్రీదేవి మృతదేహం అప్పగింత, తరలింపు అంశాలకు సంబంధించి తీవ్ర ఊగిసలాటకు తెరపడింది. శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించేందుకు దుబాయ్ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం ఏ సమయానికైనా మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పినప్పటికీ క్లారిటీ కనిపించడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ గందరగోళం కొనసాగుతుండగానే బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ దుబాయ్‌కి ప్రయాణం కావడం అనేక సందేహాలను రేకెత్తించింది.

మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కాన్సులేట్ అధికారులకు దుబాయ్ పోలీసులు అనుమతుల పత్రాలను అందించారు. దాంతో శ్రీదేవి మృతదేహానికి ఎంబల్మింగ్‌కు మార్గం సుగమమైంది.

గుంభనంగా దర్యాప్తు

గుంభనంగా దర్యాప్తు


గళవారం శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించే అంశంపై అసందిగ్ధత కనిపించింది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ చేస్తున్న దర్యాప్తు చాలా గుంభనంగా కొనసాగడంతో ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదు.

నిరాశలో శ్రీదేవి ఫ్యామిలీ

నిరాశలో శ్రీదేవి ఫ్యామిలీ

శ్రీదేవి కుటుంబానికి చెందిన ఇద్దరు, భారతీయ కాన్సులేట్‌కు సంబంధించిన ముగ్గురు అధికారులు దుబాయ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం కనిపించారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు 11.30 గంటల ప్రాంతంలో వారు నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.

 దుబాయ్‌కి అర్జున్‌కపూర్

దుబాయ్‌కి అర్జున్‌కపూర్

ఇదిలా ఉండగా, అనేక ఊహాగానాల మధ్య బోనికపూర్‌ కుమారుడు అర్జున్‌కపూర్ దుబాయ్‌కి బయలుదేరి వెళ్లాడు. తన తండ్రికి అండగా ఉండటానికి వెళ్లినట్టు చెప్పినప్పటికీ అర్జున్ వెళ్లడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

ప్రకటన చేయకపోవడంపై

ప్రకటన చేయకపోవడంపై

శ్రీదేవి మరణించి ఇప్పటివరకు మూడు రోజులు కావోస్తున్న కుటుంబ సభ్యులు గానీ, బంధువుల నుంచి గానీ, సినీ పరిశ్రమ తరుఫున గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. అందరూ గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

 అరెస్ట్ తప్పదంటూ వార్తలు

అరెస్ట్ తప్పదంటూ వార్తలు

ఇక శ్రీదేవి మరణం సహజం అనుకొన్నప్పటికీ అది వివాదంగా మారడం, ఆ వ్యవహారంలో బోనికపూర్ వైపు అనేక అనుమానాలు తలెత్తడంతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఈ కేసులో బోని కపూర్ వాగ్మూలాన్ని దుబాయ్ సేకరించిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ తప్పదంటూ వార్తలు వచ్చాయి.

గందరగోళం మధ్య బోని

గందరగోళం మధ్య బోని

ఇలాంటి అనేక చిక్కు ప్రశ్నలు, సందేహాలు ఒకవైపు కొనసాగుతుండగా అర్జున్ కపూర్ దుబాయ్‌కి వెళ్లడం మరింత ఆసక్తిని రేపింది. ఇలాంటి ఊగిసలాట మధ్య శ్రీదేవి మరణానికి సంబంధించిన దర్యాప్తు ఎపిసోడ్‌కు దుబాయ్ పోలీసులు తెరదించడంతో కథ సుఖాంతమైందనిపించింది.

ఒకవేళ సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో శ్రీదేవి మృతదేహాన్ని తరలిస్తే రాత్రి 10 గంటల తర్వాత ప్రత్యేక విమానం ముంబైకి చేరుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవిని కడసారి దర్శించుకొనేందుకు వేచిచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X