శ్రీదేవిపై బోని అప్పుడే కన్నేశాడట.. సినీ కథను మించిన లవ్‌స్టోరి.. ట్రాజెడీ ఎండింగ్

By Rajababu

శ్రీదేవి ఆకస్మిక మృతి భర్త బోనికపూర్‌కు మానసికంగా అనేక ఇబ్బందుల్లోకి నెట్టింది. శ్రీదేవి మరణంపై అనేక ఊహగానాలు రావడంతో సమాజంలో బోని ప్రతిష్టపై కొంత మసకబారినట్లయింది. అయితే శ్రీదేవి, బోనిల దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగినట్టు సన్నిహితులు చెప్పుకొంటారు. శ్రీదేవి కోసం కుటుంబాన్ని వదులుకొన్న బోని జీవితంలో చివరి అంకం వివాదంగా మారింది. అయితే శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి బోని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పుకొంటారు. అలాంటి కొన్ని సంఘటనలు ఇవే..

 శ్రీదేవిని చూసి బోనికపూర్..

శ్రీదేవిని చూసి బోనికపూర్..

1970 దశకంలో ఓ తమిళ సినిమాలో శ్రీదేవి అందాన్ని చూసి బోనికపూర్ ప్రేమలో పడ్డారట. ఆ సినిమా చూసిన వెంటనే ఆ అమ్మాయి ఎవరో వివరాలు కావాలి అని వాకబు చేశారు. శ్రీదేవి చూసిన తర్వాత మనసు నియంత్రించుకోలేక ఆమెను కలువడానికి చెన్నై వెళ్లారు.

బోనికి అలా నిరాశ..

బోనికి అలా నిరాశ..

కానీ ఆ సమయంలో శ్రీదేవి షూటింగ్ కోసం సింగపూర్‌కు వెళ్లడంతో బోనికి నిరాశే ఎదురైంది. దాంతో అసంతృప్తితోనే బోని ముంబైకి తిరిగి రావడం జరిగింది.

సోలా సావన్ చూసి

సోలా సావన్ చూసి

ఆ తర్వాత 1979లో హిందీలో సోలా సావన్ అనే సినిమాను చూశాడు. వెంటనే ఓ షూటింగ్‌లో ఉందని తెలుసుకొన్న బోని ఆమెను కలువడానికి సెట్‌కు వెళ్లాడు. అయితే శ్రీదేవి కొన్ని కారణాల వల్ల కలుసుకోవడానికి వీలు పడలేదు.

మిస్టర్ ఇండియాలో ఛాన్స్

మిస్టర్ ఇండియాలో ఛాన్స్

మిస్టర్ ఇండియా సినిమాలో నటించమని కోరగా రూ.10 లక్షలు డిమాండ్ చేసిందట. అయితే శ్రీదేవికి బోని రూ.11 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చాడనట్టు ఆయన సన్నిహితులు చెబుతారు.

 10 లక్షలు అడిగితే.. 11 లక్షలు

10 లక్షలు అడిగితే.. 11 లక్షలు

శ్రీదేవికి రూ.11 లక్షలు ఎందుకు ఇచ్చాననే విషయంపై ఓసారి వివరణ ఇస్తూ.. శ్రీదేవికి దగ్గర కావాలనుకొన్నాను. అందుకే ఆమె 10 లక్షలు కోరితే.. రూ.11 లక్షలు ఇచ్చాను. నా తాపత్రయం చూసి నా తల్లి చాలా ఇంప్రెస్ అయింది అని చెప్పారు.

శ్రీదేవి కోసం ప్రత్యేకంగా

శ్రీదేవి కోసం ప్రత్యేకంగా

బోనికపూర్ ఊహించినట్టుగానే మిస్టర్ ఇండియా షూటింగ్‌లో శ్రీదేవి దగ్గరైంది. శ్రీదేవి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆమెకు అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకొన్నారు. ఆ సమయంలో వ్యానిటీ వ్యాన్స్ లేకపోవడంతో శ్రీదేవి కోసం ప్రత్యేకంగా ఓ మేకప్ రూమ్‌ను ఏర్పాటు చేశాడట.

బోనికపూర్‌కు అప్పటికే పెళ్లి

బోనికపూర్‌కు అప్పటికే పెళ్లి

శ్రీదేవికి దగ్గరవుతున్న సమయంలోనే బోనికపూర్‌కి మోనాకపూర్‌తో వివాహం జరిగింది. అప్పటికే అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌ పిల్లలు కలిగారు.

శ్రీదేవి కోసం స్విట్జర్లాండ్‌కు

శ్రీదేవి కోసం స్విట్జర్లాండ్‌కు

శ్రీదేవితో పీకల్లోతు ప్రేమలో పడిన బోనికపూర్.. ఆమె చాందినీ సినిమా కోసం స్విట్జర్లాండ్ వెళితే అక్కడికి కూడా వెళ్లాడు. ఆ తర్వాతే తన భార్యకు శ్రీదేవి ప్రేమ విషయం వెల్లడించాడట.

 మోనా కపూర్ అసంతృప్తి

మోనా కపూర్ అసంతృప్తి

మోనా కపూర్ అసంతృప్తి, వ్యతిరేకత మధ్య శ్రీదేవిని బోని కపూర్ వివాహం చేసుకొన్నారు. వివాహానికి ముందే శ్రీదేవి గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

శ్రీదేవితో పెళ్లి

శ్రీదేవితో పెళ్లి

ఆ తర్వాత చాలా రోజుల వరకు శ్రీదేవితో వివాహాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. జాహ్నవి పుట్టిన తర్వాత శ్రీదేవితో వివాహం గురించి బయటకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X