ఓట్ల కోసం శ్రీదేవి హొయలు, ట్రాఫిక్ జాం (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ శ్రీదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొని హొయలు పోతుంటే ఆమెను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. రాష్ట్రీయ్ లోక్ దల్ అభ్యర్థి అమర్ సింగ్ తరుపున శ్రీదేవి ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఫతేపూర్ సిక్రిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శ్రీదేవి తన భర్తతో కలిసి పాల్గొంది.
ఒకప్పుడు ఎంతో మంది కలల రాణి అయిన శ్రీదేవి అప్పట్లో వెండి తెరపై తన అందం, అభినయంతో అభిమానులను తన్మయత్నంలో ముంచెత్తింది. సినిమాలకు దూరమైన గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. దీంతో ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆ ఎఫెక్టు ఎన్నికల ప్రచారంలో కనపడుతోంది.
శ్రీదేవిని చూడటానికి భారీగా అభిమానులు తరలి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు.

అమర్ సింగ్
అమర్ సింగ్ అంటే సినిమా వాళ్లందరికీ ఆప్తుడే. అందుకే ఆయన ఎన్నికల్లో దిగుతున్నాడంటే సినిమా తారలు క్యూ కట్టడం షరా మామూలే.

శ్రీదేవి ప్రచారం
అమర్ సింగ్ తరుపున శ్రీదేవి తనదైన రీతిలో ప్రచారం చేస్తోంది. ఆయన్ను గెలిపిస్తే మీకు అసలైన అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తాడని ప్రచారం చేస్తోంది.

అధికార పక్షానికి అనుకూలమే
అమర్ సింగు తరుపున ప్రచారం చేయడం ద్వారా శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచిందని చెప్పొచ్చు. రాష్ట్రీయ లోక్ దల్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో దిగింది.

భర్తతో పాటు ప్రచారంలో...
ఈ ఎన్నికల ప్రచారంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా ఆమెకు తోడుగా నిలవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











