అశ్రునయనాలతో శ్రీదేవి సంస్మరణ సభ.. నా గుండె తరుక్కుపోయింది.. భావోద్వేగంలో సినీ ప్రముఖులు
Recommended Video

అందాల తార శ్రీదేవి ఇకలేరన్న వార్త అన్ని సినీ పరిశ్రమలను కుదిపేసింది. అతిలోక సుందరి మరణం నేపథ్యంలో పారిశ్రామికవేత్త, ఎంపీ, నిర్మాత టీ సుబ్బరామిరెడ్డి హైదరాబాద్‌లో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయప్రద, జయసుధ, నివేదా థామస్, జీవిత, పింకిరెడ్డి, కవిత, జగపతిబాబు, నరేష్,అల్లు అరవింద్, సుమంత్, శివాజీరాజా, దర్శకుడు రేలంగి నరసింహారావు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

టీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ
ఈ సందర్భంగా టీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీదేవితో అనుబంధాన్నిగుర్తు చేసుకొన్నారు. చాందినీ, లమ్హే చిత్రాలకు యష్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరిచడం నా జీవితంలో గొప్ప విషయం అని చెప్పారు. శ్రీదేవి సినిమాపరంగానే కాకుండా కుటుంబ పరంగా నాకు మంచి ఆప్తురాలు అని సుబ్బరామిరెడ్డి అన్నారు.

శ్రీదేవి నాకు చిన్ననాటి
శ్రీదేవి నాకు చిన్ననాటి స్నేహితురాలు. శ్రీదేవికి 16 ఏళ్లు వచ్చేసరికి మేము మంచి స్నేహితులుగా ఉన్నాం. ఎంతమంది స్నేహితులు ఉన్నా చిన్ననాటి స్నేహితులే ఎక్కువగా గుర్తిండిపోతారు. అలాంటి నా చిన్ననాటి స్నేహితురాలు శ్రీదేవి ఆర్థాంతరంగా జీవితాన్ని ముగించడం చాలా బాధగా ఉంది. శ్రీదేవి ఇక లేరు అనే వార్త వినగానే గుండె పగిలినంత ఆవేదనకు గురయ్యాను. శ్రీదేవి స్థానాన్ని ఎవరూ పూర్తి చేయలేరు అని నరేష్ అన్నారు.

శ్రీదేవి నాకంటే ముందుగానే
శ్రీదేవి నాకంటే ముందుగానే బాలనటిగా స్థిరపడింది. బాలనటుల్లో ఆమె స్టార్‌గా వెలుగొందన సమయంలోనే ఓ సినీ స్టార్‌గా చూసేందుకు, కలిసేందుకు ముచ్చటపడ్డాను. జనన, మరణాల విషయంలో ఎవరూ బాధపడకూడదు. నేను శ్రీదేవి కలిసి సుమారు 10 చిత్రాల్లో నటించాం. ఆమె మరణవార్త విన్న తర్వాత చాలా కుంగిపోయాను. అప్పటి నుంచి టీవీలో వార్తలు కూడా వినిలేదు. చివరిసాగి అంతిమయాత్రలో శ్రీదేవి ముఖాన్నిచూసి టీవీ కట్టేశాను అని జయసుధ తెలిపారు.

శ్రీదేవి బాలనటిగా
శ్రీదేవి బాలనటిగా ఉన్నప్పుడే ఆమెకు అభిమానిగా మారిపోయాను. బడిపంతులు చిత్రంలో బూచడమ్మా బూచాడు పాటలో లెక్కలేనన్ని హావభావాలు ప్రదర్శించినప్పుడే మహనటి అవుతుంది అని అనుకొన్నాను అని బాబూమోహన్ అన్నారు.

నా చిన్నతనంలో
నా చిన్నతనంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రేమాభిషేకం చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎడెనిమిదేళ్ల వయసులో ఆ చిత్ర షూటింగ్‌కు వెళ్లేవాడిని. తాతగారు నా కోసం వస్తుందని అనుకొనే వారు. కానీ నేను శ్రీదేవి కోసం వెళ్లేవాడిని అని ఎప్పటికీ ఆయనకు చెప్పలేదు.

శ్రీదేవి అతిలోక సుందరి
శ్రీదేవి అతిలోక సుందరి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు, హిందీ భాషల్లో పదికిపైగా చిత్రాల్లో కలిసి నటించాం. అయితే డైలాగ్స్ చెప్పడంలోనూ, డ్యాన్సుల చేయడంలోనూ, ఇతర విషయాల్లోనూ పోటీపడి నటించేవాళ్లం. నటన విషయంలో శ్రీదేవికి శ్రీదేవి సాటి అని జయప్రద అన్నారు.

శ్రీదేవితో నటించే
శ్రీదేవితో నటించే అవకాశం లభించలేదు. ఆ అదృష్టం నాకు కలుగులేదు. టీవీ వార్తలు విన్న సమయంలో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఆమెతో నటించి, అనుబంధం ఉన్నవారికి శ్రీదేవి లేరనే వార్తతో ఎంత బాధను అనుభవిస్తున్నారో నాకు తెలుసు. తల్లిలేని పిల్లలుగా జాహ్నవి, ఖుషీ పరిస్థితిని, భార్య లేని బోని సార్ బాధను అర్థం చేసుకొంటాను. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని నివేదా థామస్ అన్నారు.

శ్రీదేవితో
శ్రీదేవితో జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరుశురాం చిత్రాలతో అనుబంధం ఉంది. వ్యక్తిగతంగానూ ఆమెతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఓసారి బోని ఆహ్వానం మేరకు నేను, అశ్వినీదత్ వారి ఇంటికి వెళ్లాం. అప్పుడు సామాన్య గృహిణిగా మాకు టీ అందించడంతో నా గుండె తరుక్కుపోయింది అని అల్లు అరవింద్ అన్నారు.


Click it and Unblock the Notifications











