శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం.. అందరినీ నొప్పించి తిరిగిరాని లోకాలకు.. సినీ తారల కన్నీటి వీడ్కోలు

By Rajababu

Recommended Video

శ్రీదేవి ముఖాన్నిచూసి టీవీ కట్టేశాను....

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు. శ్రీదేవి జ్ఞాపకాలతో మరోసారి తల్లడిల్లిపోయింది తెలుగు చలన చిత్రపరిశ్రమ. ఆదివారం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ జరిగింది. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 'శ్రీదేవి మళ్లీ శ్రీదేవిగానే పుట్టాలి' అని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, అమల, కోటశ్రీనివాసరావు, కవిత, జీవిత, రాజశేఖర్‌, సి.కల్యాణ్‌, పి.సుశీల, నివేదాథామస్‌, బి.వి.ఎస్‌,ఎన్‌.ప్రసాద్‌, ఉపాసన, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీదేవికి బతికి ఉండగానే చారడేసి కళ్లు

శ్రీదేవికి బతికి ఉండగానే చారడేసి కళ్లు

కృష్ణంరాజు మాట్లాడుతూ - ''సాధారణంగా చచ్చినవారి కళ్లు చారడేసి అంటుంటారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వారిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. కానీ శ్రీదేవి కళ్లు బ్రతికుండగానే చారడేసి కళ్లు అమ్మాయి అయింది. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నాలుగైదు సినిమాలే చేశాను. అద్భుతమైన నటి. కొన్ని క్యారెక్టర్స్‌ను ఆమె తప్ప మరెవరూ చేయలేరనిపించేలా నటించింది. మంచి సంస్కారం ఉన్న నటి. బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాను హిందీలో తీసినప్పుడు తనే హీరోయిన్‌గా నటించింది. అడిగిన వెంటనే డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి నటించింది. నాతోనే కాదు.. తను నటించిన సినిమాల్లో అందరితో మంచి సహకారాన్ని అందించింది. అన్ని భాషల్లో నటించిన శ్రీదేవిగారు అన్నింటిలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

శ్రీదేవి నన్నెప్పుడూ సర్‌ అని

శ్రీదేవి నన్నెప్పుడూ సర్‌ అని

‘‘శ్రీదేవి నన్నెప్పుడూ ‘సర్‌' అని పిలిచేది. పెద్దలంటే ఆమెకు చాలా గౌరవం. నటిగా కొన్ని పాత్రలు ఆమె తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆమధ్య కలిసినప్పుడు ‘చిత్రసీమకొచ్చి నాకు యాభై ఏళ్లు. మీకూ యాభై ఏళ్లయ్యాయి. దీన్ని ఓ వేడుకగా జరుపుకోవాలి. ఆ కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తా' అంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న' హిందీలో తీశాం. అందులో కథా నాయికగా శ్రీదేవి నటించింది. నేను ఫోన్‌ చేయగానే ఒప్పుకొంది. ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ బాగా సహకరించింది''

దేవతగా.. అనురాగదేవతగా శ్రీదేవి

దేవతగా.. అనురాగదేవతగా శ్రీదేవి

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు తను బాలనటిగా నటించిన బడిపంతులు సినిమా చూశాను. తను నటిగా 50 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ నేను తనను మొదటిసారి చూసిన చిన్నపిల్ల రూపమే మనసులో నిలిచిపోయింది. తనతో 'అనురాగదేవత' సినిమాకు మేం తొలిసారి కలిసి పనిచేశాం. రామానాయుడుగారు ఆమెను చిత్రసీమకు దేవతను చేస్తే.. ఎన్టీఆర్‌గారు అనురాగదేవతను చేశారు. అనుభవ పూర్వకంగా స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన నటి. మళ్లీ ఆవిడ పుట్టి మనకు కనపడాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

 శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం

శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం

‘‘మన కళ్ల ముందు నుంచి శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం. ‘అనురాగ దేవత' షూటింగ్‌ రవీంద్ర భారతిలో జరుగుతోంటే మేం వెళ్లాం. ‘చూసుకో పదిలంగా' అనే పాట.. ప్రేక్షకుల్లో కూర్చుని చూశాం. అదో జ్ఞాపకం. రామానాయుడు ‘దేవత' చేశారు. ఎన్టీఆర్‌ ‘అనురాగ దేవత' చేశారు. అలాంటి దేవత.. స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో కన్నీటి వీడ్కోలు ఇవ్వాల్సిరావడం బాధాకరమైన విషయం''

ఆత్మకు శాంతి కలగాలని

ఆత్మకు శాంతి కలగాలని

అమల అక్కినేని మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు బ్యూటీఫుల్‌, ఫాబులస్‌ ఆర్టిస్ట్‌. అనుకోకుండా ఆమె మనల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దేవలోకం నుంచి వచ్చిన శ్రీదేవి

దేవలోకం నుంచి వచ్చిన శ్రీదేవి

పి.సుశీల మాట్లాడుతూ - ''దేవలోకం నుంచి వచ్చిన సుందరిలాగా మన ముందకు వచ్చి.. మనల్ని మరపించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన కోసం పాట పాడాను. తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు నేను పాటలు పాడాను. మనకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. ఆమె మనసుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ‘‘దేవలోకంలోంచి వచ్చిన సుందరిలా మన కళ్ల మందు కదిలి.. మళ్లీ తన లోకానికి వెళ్లిపోయింది. తన ఎనిమిదేళ్ల వయసులో తనకు నేను ఓ పాట పాడినందుకు గర్విస్తున్నాను. హీరోయిన్‌గా తొలి సినిమాలోనూ నేనే పాట పాడాను. అది భగవంతుడు నాకిచ్చిన అవకాశం'

నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు

నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు చిరస్థాయిగా మన మనస్సుల్లోనే ఉన్నారు. నటిగా ఆమె ఏ రోజు ఏ నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు. కానీ ఈ ఏడాది మన అందరినీ నొప్పించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బోనీ, జాన్వీ, ఖుషీలు సహా అందరికీ ఆ దేవుడు ఆత్మ స్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

శ్రీదేవి మరణవార్తతో షాక్‌కు

శ్రీదేవి మరణవార్తతో షాక్‌కు

డా.రాజశేఖర్‌ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారి మరణవార్త విని చాలా షాక్‌కు గురయ్యాం. ఆమె తండ్రి ఆయ్యప్పన్‌గారితో మా నాన్నకు మంచి అనుబంధం ఉండేది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమె ప్రతి భారతీయుడి కుటుంబంలో భాగమైన నటి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది

దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది

కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ - ''నేను శ్రీదేవిగారితో కలిసి రెండు, మూడు సినిమాల్లో పనిచేశాను. ఆ దేవుడు నటిగా పుట్టించాడు. ఆమె యాబై ఏళ్లు నటించింది. మళ్లీ దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఉపాసన, సుమంత్ హాజరు

ఉపాసన, సుమంత్ హాజరు

ఈ కార్యక్రమంలో జగపతిబాబు, అమల, జీవిత, రాజశేఖర్‌, పింకి రెడ్డి, ఉపాసన, శోభనా రెడ్డి, సుమంత్‌, కోట శ్రీనివాసరావు, నరేష్‌, శివాజీరాజా, అలీ, కవిత, రేలంగి నరసింహారావు, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.-- కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు శ్రీదేవికి త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X