»   » ముదురు వయసులోనూ ఇంత కక్కుర్తా: పెళ్ళిళ్లలో డాన్సులు చేసిందెవరో తెలిస్తే నమ్మలేరు

ముదురు వయసులోనూ ఇంత కక్కుర్తా: పెళ్ళిళ్లలో డాన్సులు చేసిందెవరో తెలిస్తే నమ్మలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన అవనాటి నటీమణి శ్రీదేవి ఈ మద్య మళ్ళీ తన గ్లామర్‌ని రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించిన ఈ అమ్మడు ఇప్పుడు మోడరన్‌గా తయారవుతు కనిపిస్తోంది. ఐదు పదులు పైబడిన శ్రీదేవి ఇప్పటికీ తనొక జగదేక సుందరిగానే ఫీలవుతూ ఉంటుంది.

కుర్ర హీరోయిన్లతో పాటు ఆఖరికి తన కూతుళ్లతో కూడా పోటీ పడి, అవకాశం దొరికినప్పుడల్లా అందాల ప్రదర్శన చేసేస్తూ ఉంటుంది. శ్రీదేవి మేకప్ ఖర్చుల కోసమే బోనీ సగం ఆస్తులు అమ్ముకున్నాడని జోకులు కూడా వినిపిస్తుంటాయి అది వేరే విషయం. ఈ మధ్యనే ఎద భాగానికి సర్జరీ చేయించుకుని శ్రీదేవి మునుపటి కంటే అందంగా కనపడుతుందని చెప్తున్నారు.

Sridevi dace in a Marriege for money

ఆ మధ్య ఎప్పుడో బాలీవుడ్‌లో ఓ సినిమా చేసి మంచి సక్సెస్‌ను అందుకుంది. దాంతో అప్పటినుంచీ శ్రీదేవికి డబ్బు పిచ్చి మరీ ఎక్కువైంది అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. శ్రీదేవితో సినిమా చేయాలంటే కొన్ని కోట్లు చేతిలో పెట్టవలసి రావడంతో ఆమెతో సినిమా అంటే అక్కడి దర్శకనిర్మాతలు భయంతో పారిపోతున్నారట! ఇక సినిమా ఛాన్సులు రావడం కష్టం అనుకుందేమో ఫంక్షన్లలో డ్యాన్సులకు ఓకే చెప్పేస్తోందట! తాజాగా ఓ బడా వ్యక్తి ఇంట జరిగిన పెళ్ళిలో డ్యాన్సులు చేయడానికి భారీ మొత్తం పుచ్చుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట స్టేజి మీద శ్రీదేవి సందడి చేసినప్పుడు సరదాకి చేసిందని అందరూ అనుకున్నారట కానీ, ఆ తరువాత వరుసగా మూడు నాలుగు పాటలకు డ్యాన్స్‌ చేసేసరికి చూస్తున్న వారికి అసలు సంగతి అర్థమయిందట! ఆ ఫంక్షన్‌కి శ్రీదేవి డ్యాన్స్‌ చేయడానికే వచ్చిందని! డ్యాన్స్‌ చేసినందుకు గానూ శ్రీదేవికి భారీ మొత్తం ముట్టిందని అంటున్నారు. సినిమాలు చేసినందుకు డబ్బు తీసుకోవటం మామూలే ఎందునటే అది ఒక జాబ్ కాబట్టి. కానీ డబ్బుకోసమే ఇమేజ్ ని వాడుకొని మరీ రికార్డింగ్ డాన్సులు చేస్తే దాన్ని వ్ర్త్తి అనరు కక్కుర్తి అంటారు.

English summary
A News from Bollywood that senior Actress Sridevi Danced in a Marriege party for Money
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu