twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవికి కష్టాలు లేవనుకోవడం తప్పు.. మానసిక వ్యధకు గురైంది.. మురళీమోహన్

    By Rajababu
    |

    Recommended Video

    Sridevi Final Rites : Murali Mohan Recollected Some Memories

    శ్రీదేవి మరణం యావత్‌ లోకాన్ని విషాద సంద్రంలో ముంచేసింది. భౌతికంగా దూరమైన అందాల నటి శాశ్వతంగా కనుమరుగుకానున్నది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ తన అనుభవాలను పంచుకొన్నారు. మురళీ మోహన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    మొదట నమ్మలేదు...

    మొదట నమ్మలేదు...

    శ్రీదేవి మరణించారనే వార్త ఆదివారం ఉదయం 5.30 గంటలకు తెలిసింది. కానీ అది తప్పుడు వార్త అని అనుకొన్నాను. ఏదో రూమర్ అయి ఉంటుంది అనే ఉద్దేశంతో టెలివిజన్ పెట్టి చూడగానే ఆ వార్త నిజమని తెలిసింది. దాంతో షాక్‌కు గురయ్యాను.

    కష్టాలను అధిగమించి

    కష్టాలను అధిగమించి

    బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రీదేవి అంచెలంచెలుగా ఎదిగింది. సినీరంగంలో మహోన్నత శిఖరాన్ని అధిరోహించిన ఆమెకు కష్టాలు లేవనుకోవడం తప్పు. ఎంతో మానసిక వ్యధ అనుభవించింది.

     తల్లిది కీలకపాత్ర

    తల్లిది కీలకపాత్ర

    సినీరంగంలో రాణించడం వెనుక శ్రీదేవి తల్లిది కీలకపాత్ర. నటిగా ఆమెను బాగా తీర్చిదిద్దారు. ఎల్లవేళలా వెంట ఉండి శ్రీదేవికి అన్నిరకాల సహాయ, సహకారాలు అందించారు.

    తల్లి మరణం తర్వాత

    తల్లి మరణం తర్వాత

    తన వ్యక్తిగత జీవితంలో, ప్రొఫెషన్‌లో కీలక పాత్ర పోషించిన తన తల్లి మరణించినపుడు శ్రీదేవి మానసికంగా కుంగిపోయింది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది.

     డిప్రెషన్ నుంచి తేరుకోవడానికి

    డిప్రెషన్ నుంచి తేరుకోవడానికి

    తల్లి మరణం తర్వాత శ్రీదేవి తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నింటిని అధిగమించి ఆమె మళ్లీ మామూలుగా మారింది. ఆ తర్వాత పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసింది.

     ఆ వాదనలో తప్పు

    ఆ వాదనలో తప్పు

    శ్రీదేవి అందరితో కలిసిపోదు అనడంలో వాస్తవం లేదు. తనకు పరిచయమైన వారందరితో కలివిడిగా ఉంటుంది. ముభావంగా కనిపించినా తనకు నచ్చిన వాళ్లతో బాగాను ఉంటుంది. ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రభావం శ్రీదేవి ముఖం మీద కనిపిస్తుందేమో తెలియదు.

    శ్రీదేవికి అలాంటి సమస్య లేదు

    శ్రీదేవికి అలాంటి సమస్య లేదు

    ఏ ఆర్టిస్టుకైన ఓ పాత్రపై అవగాహన ఉండాలి. పాత్ర గురించి ఎలా చేయాలనే విషయంపై తర్జనభర్జన పడుతాం. అలాంటి సమయంలో మానసిక సంఘర్షణకు గురవుతాం. కానీ ఏ సన్నివేశానైన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేది. సీన్ చెప్పగానే అందులోకి ఇట్టే ప్రవేశించేది.

     శ్రీదేవి పూర్తిగా సహకరించేది

    శ్రీదేవి పూర్తిగా సహకరించేది

    సినిమా ఒప్పుకొన్న తర్వాత వందశాతం సహకరించేంది. చెప్పిన సమయానికంటే ముందే స్పాట్‌కు వచ్చేవారు. అందరితో కలిసి మెలిసి ఉండేవారు. సినీ పరిశ్రమలో ప్రస్తుతం పరిస్థితి కనిపించడం లేదు.

    సినిమా తీసే అవకాశం..

    సినిమా తీసే అవకాశం..

    శ్రీదేవితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మేము చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించే సరికి శ్రీదేవి దేశంలోని ఓ సూపర్‌స్టార్‌గా మారింది. మేము తక్కువ బడ్జెట్‌తో రూపొందిచే వాళ్లం కనుక ఆమెతో సినిమా తీసే అవకాశం లభించలేదు.

    English summary
    From her fans across the globe to her family members and friends from Bollywood, everyone is trying hard to digest the fact that the Sridevi is no more. Sridevi's co-star, MP Murali Mohan recollected some memories with the actress. He said Sridevi suffered to reach her ultimate position in the film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X