శ్రీదేవి ప్రథమ వర్థంతి: చిరంజీవి, వెంకటేష్‌పై వర్మ సెటైర్లు.. మందు గ్లాసుతో నాగ్..
అందాల నటి శ్రీదేవి ఈ లోకాన్ని వీడి సరిగ్గా ఏడాది పూర్తయింది. దుబాయ్‌లో పెళ్లికి హాజరైన శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మృత్యువాత పడి ఫిబ్రవరి 24వ తేదీన సంగతి తెలిసిందే. శ్రీదేవి ప్రథమ వర్దంతి సందర్బంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ పాత ఫొటోను షేర్ చేశాడు. శ్రీదేవి, నాగార్జున, నేను మాత్రమే నిజాయితీపరులమని ట్వీట్ చేశారు. ఆ ఫొటో వెనుక కథేంటంటే..

మందు పార్టీలో శ్రీదేవితో
క్షణం క్షణం సినిమా తర్వాత వెంకటేశ్, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జునతో కలిసి రాంగోపాల్ వర్మ ఫొటో దిగారు. ఆ సందర్భంగా జరిగిన ఓ పార్టీలో మందు గ్లాసులతో దర్శనమిచ్చారు. వర్మ, నాగార్జున చేతిలో మందు గ్లాసులు, శ్రీదేవి ఉత్త చేతులు, వెంకటేష్, చిరంజీవి చేతులు వెనుకకు దాచుకొన్న పాత ఫొటోను ట్వీట్ చేశారు.
మేమే నిజాయితీపరులమని
అప్పటి ఫోటో గురించి వర్మ కామెంట్ చేస్తూ.. కుడి, ఎడమ వైపున ఉన్న వ్యక్తుల చేతుల్లో గ్లాసులు ఉన్నాయి. మధ్యలో ఉన్న చేతుల్లో ఉన్నవేవో దాస్తున్నారు. శ్రీదేవి గారి రెండు చేతుల్లో ఏమీ లేవు. దీనిని బట్టి నేను, శ్రీదేవి, నాగార్జున మాత్రమే నిజాయితీ పరులమని చెప్పవచ్చు అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

శ్రీదేవికి వీరాభిమానిగా వర్మ
దివంగత శ్రీదేవికి రాంగోపాల్ వర్మ వీరాభిమాని. ఆమెతో క్షణ క్షణం, గోవింద గోవిందా సినిమాలను అద్బుతంగా తెరకెక్కించారు. అతిలోక సుందరిని తలపించే విధంగా శ్రీదేవి అందాన్ని కెమెరాలో బంధించాడు. అంతటి అభిమానాన్ని కురిపించే వర్మ.. శ్రీదేవి ఒప్పుకొంటే పెళ్లికి కూడా రెడీ అన్నారు. కానీ ఆమె బోనికపూర్‌ను పెళ్లి చేసుకోవడంతో నిరాశపడ్డారు.

గన్స్ అండ్ థైస్ పుస్తకంలో
శ్రీదేవిపై ఉన్న ఆరాధనాభావాన్ని ఎన్నోసార్లు బయటపెట్టారు. తనకెంతో ఇష్టమని పలు విధాలుగా వెల్లడించారు. ఆమెపై ఉన్న అభిమానం ఎంత గొప్పదో అని చెప్పడానికి తన పుస్తకం గన్స్ అండ్ థైస్‌లో ఓ చాప్టర్ పేరుకు మై శ్రీదేవి అని పేరుపెట్టారు. అంతగా శ్రీదేవిని ఆరాధిస్తారనేది దానికి సాక్ష్యంగా నిలిచింది.

శ్రీదేవి మరణంతో విషాదంలో వర్మ
ఇక శ్రీదేవి మరణించారని తెలిసినప్పుడు వర్మ ఎంతో బాధపడ్డారు. శ్రీదేవి మృతి తర్వాత దేవుడంటే మరింత ద్వేషం, కోపం పెరిగింది అంటూ తన విషాదాన్ని వెల్లగక్కారు. ఆమె మరణించినప్పుడు సోషల్ మీడియాలో తన బాధను లేఖ రూపంలో వెల్లడించారు. తాజాగా ఇలా మరోసారి గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











