శ్రీదేవి బాడీకి ఎంబామింగ్ ఎందుకు? దుబాయ్‌లోనే బోని?.. అందుకే అర్జున్‌కపూర్ అక్కడికి!
Recommended Video

ప్రముఖ నటి శ్రీదేవి మృతి విషయంలో కొనసాగుతున్న అనేక అనుమానాలకు కొంత తెరపడింది. పలు ఊహాగానాల మధ్య శ్రీదేవి కుటుంబ సభ్యులకు, భారత రాయబార కార్యాలయానికి అనుమతి పత్రాలను అందించారు. ఈ విషయాన్ని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
ఎంబామింగ్ సెంటర్‌కు
కాన్సులేట్‌కు, శ్రీదేవి కుటుంబ సభ్యులకు దుబాయ్ పోలీసులు క్లియెరెన్స్ లెటర్స్ ఇచ్చారు. దీంతో ఆమె మృతదేహాన్ని తరలించేందుకు మార్గం సుగమైంది. త్వరలోనే శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ చేయనున్నారు.

గంటకుపైగా ప్రక్రియ
గత మూడు రోజులుగా శ్రీదేవి మృతదేహం మార్చురీలో పెట్టారు. అధికారుల అనుమతి తర్వాత మార్చురీ నుంచి ఎంబామింగ్ యూనిట్‌కు ఆమె మృతదేహాన్ని తరలిస్తారు.
శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ చేయడానికి దాదాపు గంటకుపైగా పడుతుంది.

మృతదేహానికి లేపనం
దుబాయ్‌లోని ప్రముఖ ఎంబామింగ్ సెంటర్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎంబామింగ్ ప్రక్రియ అంటే మృతదేహానికి రసాయన లేపనాలు పూస్తారు. పార్దీవదేహం కుళ్లిపోకుండా రసాయనాలు కాపాడుతాయి. ముఖంపై ఎలాంటి మరకలు లేకుండా శుద్ధి చేస్తారు.

వాడే రసాయనాలు ఇవే
ఎంబామింగ్ (రసాయన పూత) ప్రక్రియలో ఫార్మాల్డీహైడ్, గ్లూతారాల్డీహైడ్, మెథనాల్, ఇథనాల్; ఫెనాల్, నీరు తదితర ద్రవాలను కలిపి మృతదేహానికి పూస్తారు.

మృతదేహం కుళ్లిపోకుండా
మృతదేహానికి ఎంబామింగ్ చేయడం ద్వారా కొన్ని గంటల వరకు మృతదేహం చెడిపోకుండా ఉంటుంది. శ్రీదేవి మృతదేహానికి ఇదే ప్రక్రియను చేస్తారు. ఇప్పటికే ఎంబామింగ్ సెంటర్‌కు అర్జున్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు చేరుకొన్నారు.

బోనికపూర్ అక్కడేనట..
కాగా క్లియరెన్స్ లభించిందనే సంతోషకరమైన వార్త మధ్య బోనికపూర్‌కు సంబంధించిన మరో అంశం తెరపైకి వచ్చింది. దర్యాప్తు పూర్తిస్థాయిలో ముగియనందున బోనికపూర్‌ను అక్కడే ఉంచే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో షికారు చేస్తున్నాయి.

అనుమతిస్తే మళ్లీ దుబాయ్‌కి
శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బోనికపూర్‌ను అనుమతిస్తే మళ్లీ వెనుకకు పిలిపించుకొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. బోనితోపాటు దుబాయ్ పోలీసులు ఇండియాకు వచ్చే అవకాశం లేకపోలేదు అని వాదన తెరపైకి వచ్చింది.

ఉత్కంఠకు తెరపడే అవకాశం
దర్యాప్తు కొసం బోనికపూర్‌ను దుబాయ్‌లో ఆపే అవకాశం ఉన్నందునే అర్జున్ కపూర్ అక్కడికి వెళ్లినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రత్యేక విమానంలో బోని బయలుదేరితే ఈ విషయంపై ఉత్కంఠకు తెరపడుతుంది.

కొద్దిగంటల్లో కేసుపై క్లారిటీ
ఒకవేళ బోని విషయంలో ఇదే జరిగితే.. శ్రీదేవి మృతి వెనుక ఇంకా మిస్టరీ ఉన్నట్టే అనేది స్పష్టమవుతుంది. కొద్దిగంటలు ఆగితే శ్రీదేవి మృతి కేసుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











