శ్రీదేవి మరణం బిగ్‌బీకి ముందే తెలుసా? కూలీ యాక్సిడెంట్ ఎఫెక్ట్ రిపీట్.. సిక్త్‌సెన్స్..

By Rajababu

సాధారణంగా ఏదన్నా కీడు, చెడు జరుగుతుందనే విషయం కొన్ని సంకేతాల రూపంలో కొన్నిసార్లు మనకు ముందే అనిపిస్తుంటాయి. ఏదో జరిగిందని తెలిస్తే దానికే ఆ సంకేతం అని బోధపడుతుంది. ఇదే విషయం బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఎదురైంది. తన జీవితానికి సంబంధముండే విషయంలో ఏదో కీడు జరుగబోతుందనే కీడు ఆయన మనసు ముందే శంకించింది. అదేమిటంటే..

అర్ధరాత్రి బిగ్‌బీ ట్వీట్

అర్ధరాత్రి బిగ్‌బీ ట్వీట్

శనివారం అర్ధరాత్రి అమితాబ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఎందుకో నాకు తెలియడం లేదు. కానీ నా మనసులో ఏదో అలజడి చెలరేగుతున్నది అని బిగ్‌బీ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన కొద్దిగంటల తేడాలోనే శ్రీదేవి ఇకలేరనే ప్రళయం లాంటి వార్త ప్రపంచ సినీ అభిమానులను కుదిపేసింది.

బిగ్‌బీకి సిక్త్‌సెన్స్

బిగ్‌బీకి సిక్త్‌సెన్స్

శ్రీదేవి మరణం విషయంలో బిగ్‌బీకి సిక్త్‌సెన్స్ ముందే చెప్పిందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అమితాబ్ ట్వీట్లు

అమితాబ్ ట్వీట్లు

శనివారం రాత్రి ఒంటిగంటకు అమితాబ్ తొలుత దక్షిణాఫ్రికాతో టీ - 20లో భారత్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. తరువాత 1.13 నిముషాలకు ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

బిగ్‌బీతో శ్రీదేవి

బిగ్‌బీతో శ్రీదేవి

అమితాబ్‌తో శ్రీదేవి ఖుదా గవా, ఆఖరీరాస్తా, ఇంక్విలాబ్, ఇంగ్లీష్ వింగ్లీష్, బాంబే టాకీస్‌ కలిసి నటించారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.

కూలీ షూటింగ్‌ సమయంలో

కూలీ షూటింగ్‌ సమయంలో

ఇదిలా ఉండగా, కూలీ చిత్ర షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటనలో బిగ్‌బీ మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో బిగ్‌బీకి ఏదో చెడు జరుగుతుంది అనే విషయం కలరూపంలో ఓ హీరోయిన్‌కు కీడు శంకించిందట.

బిగ్‌బీకి హీరోయిన్ ఫోన్

బిగ్‌బీకి హీరోయిన్ ఫోన్

కల నుంచి వెంటనే తేరుకొని ఎక్కడో కూలీ షూటింగ్ ఉన్న అమితాబ్‌కు ఫోన్ చేసిందట. వెంటనే తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొందట. తాను బాగానే ఉన్నాని బిగ్‌బీ తెలుపడంతో ఆమె మనసు కుదటపడిందట.

మరుసటి రోజే బిగ్‌బీకి

మరుసటి రోజే బిగ్‌బీకి

కానీ ఆ తర్వాత రోజు ఉదయమే కూలీ షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు కోమాలోకి వెళ్లినంత పనైంది. చాలా రోజులు చావుతో పోరాడి ఆయన మృత్యంజయుడిగా మారారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X