»   »  శ్రీదేవి మరణం: ఆ ఫోటోలేంటి? దొంగ ఏడుపులు ఇక ఆపమంటూ నటిపై విమర్శలు!

శ్రీదేవి మరణం: ఆ ఫోటోలేంటి? దొంగ ఏడుపులు ఇక ఆపమంటూ నటిపై విమర్శలు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  శ్రీదేవి మరణం: ఆ ఫోటోలేంటి? దొంగ ఏడుపులు ఇక ఆపమంటూ నటిపై విమర్శలు!

  బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ రాఖీ సావంత్ తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈవిడ ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో, నెటిజన్లలో ముద్రపడిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణంపై రాఖీ సావంత్ పెట్టిన పోస్టు ఒకటి విమర్శలకు దారి తీసింది. ఆగ్రహం చెందిన కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

   నీకు బుద్ది ఉందా? ఆ ఫోటో షేర్ చేస్తావా?

  నీకు బుద్ది ఉందా? ఆ ఫోటో షేర్ చేస్తావా?

  బాలీవుడ్ ప్రముఖులంతా శ్రీదేవి ఓల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. అయితే రాఖీ సావంత్ శ్రీదేవి డెడ్ బాడీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో శ్రీదేవి అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు బుద్ది ఉందా? ఇలాంటి ఫోటోలు పోస్టు చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు.

   ఆ ఫోటో డిలీట్ చేయమంటూ ఆగ్రహం

  ఆ ఫోటో డిలీట్ చేయమంటూ ఆగ్రహం

  శ్రీదేవి డెడ్ బాడీ ఫోటోలను డిలీట్ చేస్తావా? లేక నీ అకౌంట్ క్లోజ్ అయ్యే వరకు రిపోర్ట్ చేయమంటావా? అంటూ కొందరు అభిమానులు బెదిరింపులకు దిగారు. దీంతో రాఖీ సావంత్ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించారు.

  శ్రీదేవిని తలుచుకుంటూ ఏడ్చేసిన రాఖీ సావంత్

  శ్రీదేవిని తలుచుకుంటూ ఏడ్చేసిన రాఖీ సావంత్

  రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసిన వీడియోలో శ్రీదేవి మరణాన్ని తలుచుకుంటూ కంటతడి పెట్టారు. ఈ వీడియోలో ఆమె తన అభిమాన తారను గుర్తు చేసుకుంటూ తీవ్రమనో వేదనకు గురవుతున్నట్లు ఉంది.

  నాకూ బ్రతకాలని లేదు అంటూ...

  ‘శ్రీదేవిజీ..మీరు వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. ఐ లవ్యూ సోమచ్‌. ఏమైంది మీకు? ఎందుకు వెళ్లిపోయారు? మీలా ఎవ్వరూ నటించలేరు, డాన్స్ చేయలేరు. మీరు చాలా మంచి వారు. మీరు లేకపోవడంతో నాకూ బతకాలని లేదు.' అంటూ ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

   దొంగ ఏడుపు అంటూ విమర్శలు

  దొంగ ఏడుపు అంటూ విమర్శలు

  అయితే రాఖీ సావంత్ పోస్టు చేసిన ఈ వీడియో మీద నెటినట్లు విమర్శలు చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం రాఖీ సావంత్ దొంగ ఏడుపు నటిస్తోందని, ఆమె పోస్టు చేసిన వీడియో చాలా ఓవర్‌గా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Rakhi had posted a video in which she was seen crying and expressing her depression over the untimely demise of Bollywood’s first female superstar Sridevi. In the video, she was seen as saying, “Sridevi Ma’am, you’ve gone. We are very sad. I love you so much. What happened to you? Why did you leave us and go away so soon? We Love you, there’s no one like you. No one can act like you, no one can dance like you. You are such a good human being. I don’t feel like living anymore. You are not there. I love you so much. “
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more