»   » మరింత మిస్టరీగా శ్రీదేవి మరణం.. 2201 రూంలో ఏం జరిగింది? బోని ఉన్నాడా? లేడా?

మరింత మిస్టరీగా శ్రీదేవి మరణం.. 2201 రూంలో ఏం జరిగింది? బోని ఉన్నాడా? లేడా?

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అందాల తార శ్రీదేవి మరణించి నాలుగు రోజులు కావోస్తున్నా ఆమె మృతిపై ఇంకా ఎన్నో సందేహాలు, ప్రశ్నలకు సమాధానం కనిపించడం లేదు. ఎన్నో మలుపులు, ట్విస్టుల మధ్య దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శ్రీదేవి కేసును క్లోజ్ చేసినట్టు ప్రకటించారు. అయితే మీడియా, సాధారణ ప్రజలు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరుకపోవడం గమనార్హం. శ్రీదేవి మరణానికి ముందు బస చేసిన హోటల్ 2201 జరిగిన విషయాలు బయటి ప్రపంచానికి మిస్టరీగానే మిగిలాయి.

  Sridevi's Sister Ready To Break Her Silence
  శ్రీదేవి మరణించెదెప్పుడు

  శ్రీదేవి మరణించెదెప్పుడు

  హోటల్ రూంలో శ్రీదేవి కచ్చితంగా ఎన్ని గంటలకు మరణించారు? స్పృహ కోల్పోయిన శ్రీదేవి గురించి భర్త బోనీ కపూర్ ఏ సమయంలో పోలీసులకు సమాచారం చేరవేశాడు? బాత్రూంలో లోపలివైపు గడియపెట్టి ఉన్న తలుపులను బోనీ ఎలా తెరువగలిగారు? ఎవరి సహాయం తీసుకొన్నారు? తీసుకొంటే వారెవరు?

  గాయాల ప్రస్తావన లేదేంటి?

  గాయాల ప్రస్తావన లేదేంటి?

  గల్ఫ్ న్యూస్ పత్రిక కథనం ప్రకారం.. శ్రీదేవి బాత్రూంలో కుప్పకూలిపోయింది అని కథనాన్ని ప్రచురించింది. కుప్పకూలి ఉంటే తలపై, శరీరంపై కనీసం చిన్న గాయమైనా ఉండాలి. వాటి గురించి పోస్టుమార్టం నివేదికలో ఎందుకు ప్రస్తావించడం లేదు.

  కూతురిని ఎందుక తీసుకెళ్లాడు

  కూతురిని ఎందుక తీసుకెళ్లాడు

  దుబాయ్‌లో తన మేనల్లుడి వివాహం జరిగిన వెంటనే బోనీకపూర్ కూతురు ఖుషీని తీసుకుని ముంబైకి ఎందుకు వచ్చారు? మళ్లీ ఒక్కరోజులోనే శ్రీదేవిని ఆశ్చర్యపరచడానికి ఎందుకు వెళ్లారు? తనవాళ్లు లేకుండా శ్రీదేవిని ఎందుకు ఒంటరిని చేశారు.

  మద్యం ఆనవాళ్లపై అనుమానాలు

  మద్యం ఆనవాళ్లపై అనుమానాలు

  శవపరీక్ష సందర్భంగా శ్రీదేవి దేహంలో మద్యం ఆనవాళ్లున్నట్టు ధ్రువీకరించారు. రాజకీయ నేత అమర్‌సింగ్, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చెప్పినదాని ప్రకారం, అమెకు మద్యం సేవించే అలవాటు లేదు. అయితే ఆమెకు బలవంతంగా మద్యం ఎవరైనా తాగించారా? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

  స్నేహితుడికే ఎందుకు ఫోన్

  స్నేహితుడికే ఎందుకు ఫోన్

  బాత్‌రూంలో సృహకోల్పోయిన శ్రీదేవి చూసి బోనీ వెంటనే హోటల్లో ఉండే ఎమర్జెన్సీ డాక్టరకు ఎందుకు ఫోన్ చేయలేదు. తన స్నేహితుడికే ఎందుకు ఫోన్ చేశారు? ఇవన్నీ అనేక సందేహాలకు తావిస్తున్నాయి.

  2201 గదిలో ఏం జరిగింది?

  2201 గదిలో ఏం జరిగింది?

  దుబాయ్ మీడియా కథనాలు ప్రకారం.. శ్రీదేవి చనిపోవడానికి 48 గంటల ముందు నుంచీ శ్రీదేవి తాను బసచేసిన జుమైరా ఎమిరేట్స్ టవర్ హోటల్‌లోని గది (నెం-2201) నుంచి బయటకు రాలేదు. భారత పత్రిక మిడ్‌డేకు తెలిపిందాన్నిబట్టి.. దుబాయ్ కాలమానం ప్రకారం శనివారం రోజు రాత్రి 10.30 గంటలకు శ్రీదేవి మంచినీళ్లు ఆర్డర్ చేశారు అని హోటల్ సిబ్బంది ఒకరు తెలిపారు.

  డోర్ ‌బెల్ కొట్టినా

  డోర్ ‌బెల్ కొట్టినా

  అయితే తాను మంచినీళ్లను తీసుకెళ్లి ఎన్నిసార్లు డోర్ బెల్ కొట్టినా తలుపు తెరువలేదు. దాంతో తాను ఆందోళనకు గురైన బాయ్, అలారం మోగించగా వచ్చిన సిబ్బంది, తలుపులు బద్దలుకొట్టి చూడగా బాత్‌రూం గదిలో నేలపై శ్రీదేవి పడిపోయి ఉన్నారు అని మిడ్ డే కథనంలో పేర్కొన్నది.

  11 గంటలకే చనిపోయిందా?

  11 గంటలకే చనిపోయిందా?

  తాము చూసే సమయానికి శ్రీదేవి నాడి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు కావోస్తున్నది. వెంటనే వాళ్లు పక్కనే ఉన్న రషీద్ హాస్పిటల్‌కు తరలించాం. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు అని హోటల్ బాయ్ మిడ్‌డే పత్రికకు చెప్పాడు.

  మిస్టరీగా శ్రీదేవి మరణం

  మిస్టరీగా శ్రీదేవి మరణం

  బోనికపూర్ కథనం ప్రకారం శ్రీదేవితో తాము ఉన్నాను అని వెల్లడైంది. కానీ హోటల్ సిబ్బంది చెప్పిన ప్రకారం రూంలో శ్రీదేవి ఒంటరిగానే ఉంది అని తెలిసింది. ఈ రెండు రకాలా భిన్న కథనాలతో శ్రీదేవి మరణం మరింత మిస్టరీగా మారింది.

  English summary
  Forensic doctors in Dubai concluded that Sridevi died of a heart attack and added there is nothing suspicious about the way the superstar passed away, official sources in Dubai said. But so many question remain without any answer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more