twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి: ఆమె రూ. 6 కోట్లు డిమాండ్ చేసిందట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర సినిమాలో ఎంత ముఖ్యమైందో సినిమా విడుదలైన తర్వాత అందరికీ అర్థమైంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ అభినయం అద్భుతం. అసలు ఆమె తప్ప ఆ పాత్రకు మరెవరూ న్యాయం చేయలేరనే రేంజిలో ఆమె పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు.

    వాస్తవానికి ఆ పాత్రకు ఆమె తొలి చాయిస్ కాదు. బాహుబలి సినిమా బాలీవుడ్లోనూ విడుదల చేస్తున్న నేపథ్యంలో రాజమౌళి ఆమె కంటే ముందు అక్కడి కథానాయికలను ఈ పాత్ర కోసం పరిశీలించారు. ఇందుకోసం సుస్మితా సేన్, శ్రీదేవిలను సమప్రదించారు. శ్రీదేవి ఈ పాత్ర కోసం రూ. 6 కోట్లు డిమాండ్ చేసిందట.

    Sridevi demanded 6 Cr from c

    భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా...శ్రీదేవికి రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఎందుకనో ఆమెను ఎంపిక చేయలేదు. చివరకు రమ్యకృష్ణను ఖరారు చేసారు. రమ్యకృష్ణ పెర్పార్మెన్స్ చూసిన తర్వాత.... ఒక వేళ శ్రీదేవి ఆ పాత్ర చేసి ఉంటే ఈ రేంజిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండేది కాదేమో అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

    ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బాహుబలి' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన 5 రోజుల్లోనే దాదాపు 230 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 స్థానంలో నిలవడంతో పాటు బాలీవుడ్లో పలు రికార్డులను తుడిచి పెట్టింది. బాహుబలి వసూళ్ల ప్రభంజనం ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో ఊహించనంతగా సాగుతోంది.

    English summary
    For the highly powerful and terrific role of 'Sivagami' played by Ramya Krishna, we do know that she's not the first choice. Baahubali makers have approached the likes of Sridevi, Sushmita Sen and others for the role. While others have give some valid reasons to not sign the flick, senior actress Sridevi has quoted 6 crores to sign the dotted line.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X