మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన శ్రీదేవి
అలనాటి అందాల తార, భారతీయ సినీ ప్రపంచాన్ని పాతికేళ్ల పాటు ఏలిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి త్వరలో ఇంగ్లీష్-వింగ్లిష్ అనే హిందీ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్ట నున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెతో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పించి తమ సినిమాపై అందరి దృష్టి పడేలా చేసుకోవాలని ప్రయత్నిస్తోంది మంచు ఫ్యామిలీ.
మోహన్ బాబు రావణాసురిడిగా నటిస్తోన్న సినిమాలో శ్రీదేవిని మండోధరిగా నటింపజేయాలనుకున్నాడు ఆయన తనయుడు, నిర్మాత మంచు విష్ణు. ఈ విషయమై ఇటీవల ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే తాను మోహన్ బాబు సరసన నటించాలంటే రూ. కోటిన్నర పారితోషికం ఇవ్వాల్సిందేనిని షాక్ ఇచ్చిందట ఈ హాట్ లేడీ.
ప్రస్తుతం తెలుగు టాప్ హీరోయిన్లే కోటినర్నకు మించి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీదేవి అంత మొత్తం డిమాండ్ చేయడం, అది కూడా కేవలం 40 - 45 రోజుల డేట్స్ కే ఈ మొత్తాన్ని అడగడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న విష్ణు....ఆమెతో మరోసారి మాట్లాడి రేటు తగ్గించుకోవాలిన అడగాలని చూస్తున్నాడట. ఆమె ఒప్పుకోని పక్షంలో మాధురీ దీక్షిత్ సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నాడట.
అయితే తన రీ ఎంట్రీపై బాగా డిమాండ్ ఉండటం వల్లనే శ్రీదేవి ఆ రేంజ్‌లో డిమాండ్ చేస్తోందని, ఆమెకు ఇప్పటికీ భాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఆ మొత్తం ఇవ్వడం వల్ల నష్టం లేదని, ఆమెను చూసేందుకు చాలా మంది థియేటర్లకు వస్తారని మరికొందరంటున్నారు.


Click it and Unblock the Notifications











