Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఏమిటా మిస్టరీ: శ్రీదేవి అకాల మరణానికి, మరో నటికి లింకు?
ప్రముఖ నటి శ్రీదేవి గుండె పోటుతో హఠాన్మరణానికి గురి కావడం సినిమా పరిశ్రమ మొత్తాన్ని విషాదంలోకి నెట్టి వేసింది. 54 ఏళ్ల ఈ అతిలోక సుందరి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం అభిమానులతో పాటు ఆమెతో కలిసి నటించిన యాక్టర్స్ సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే శ్రీదేవి మరణంతో అప్పట్లో ఆమెతో పాటు ఇండస్ట్రీలో పోటాపోటీగా రాణించి, అనుమానాస్పదంగా మరణించిన దివ్యభారతిని పలువురు గుర్తు చేసుకునేలా చేసింది.
యంగ్ సిస్టర్ ఆఫ్ శ్రీదేవిగా గుర్తింపు
శ్రీదేవి టాప్ పొజిషన్లో దూసుకెళుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దివ్య భారతి అనతి కాలంలోనే వరుస సినిమాలతో దూసుకొచ్చింది. అప్పట్లో ఆమెను అంతా యంగ్ సిస్టర్ ఆఫ్ శ్రీదేవి అని పిలుస్తుండేవారు.
శ్రీదేవిని ప్లేసును భర్తీ చేస్తుందని భావించారు, కానీ
అప్పట్లో దివ్యభారతి అందం, జోరు చూసిన వారంతా టాప్ పొజిషన్లో కొనసాగుతున్న శ్రీదేవి పక్కకు నెట్టి ఆ ప్లేసును దివ్య భారతి దక్కించుకుంటుందని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా దివ్యభారతి 1993లో అకాలమరణం పొందారు. బాల్కనీ నుండి కింద పడిపోయి అనుమానాస్పదంగా మరణించారు.
శ్రీదేవి మరణానికి, దివ్యభారతి బర్త్ డేకు లింకు
దివ్యభారతి ఫిబ్రవరి 25, 1974లో జన్మించారు. కట్ చేస్తే అదే తేదీ... అంటే నేడు(ఫిబ్రవరి 25) యావత్ ఇండియన్ సినీపరిశ్రమ మొత్తం శ్రీదేవి మరణవార్తతో విషాదంలో మునిగిపోయింది.
మూడేళ్లలో 13 సినిమాలు
అప్పట్లో దివ్యభారతి జోరు ఏ రేంజిలో ఉండేదంటే....ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్ల కాలంలో ఆమె దాదాపు 13 సినిమాల్లో నటించారు. వరుస సినిమాలతో అప్పట్లో ఆమె పేరు మారుమ్రోగి పోయింది. అయితే దివ్యభారతి మరణించే సమయానికి ఆమె సైన్ చేసిన కొన్ని సినిమాలు సగం మాత్రమే పూర్తయ్యాయి.
శ్రీదేవితో ఆ సినిమాలు పూర్తి చేశారు
దివ్య భారతితో సగం పూర్తయిన సినిమాలు అప్పట్లో శ్రీదేవితో పూర్తి చేశారు. ఇద్దరూ ఇంచు మించుగా ఒకే పోలికలతో ఉండటంతో శ్రీదేవి ఆ సినిమాలకు బాగా సూటయ్యారు. ఇపుడు శ్రీదేవి హఠాన్మరణంతో అందరూ ఆమెను గుర్తు చేసుకుంటున్నారు.