కుమార్తె జాహ్నవి ఎంట్రీ గురించి తేల్చిన శ్రీదేవి
ముంబై: మొత్తానికి అతిలోక సుందరి శ్రీదేవి తన కుమార్తె జాహ్నవి హీరోయిన్ గా ఎంట్రీ విషయమై తేల్చి చెప్పింది. ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ జాహ్నవికి సరైన సమయంలో వివాహం చేయాలనుకుంటున్నానని, ఆమెకు కూడా నటన అంటే ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తనుకున్న భాధ్యత తన కుమార్తెకు మంచి భర్తను వెతకటం అంది. ఇటీవల ముంబయ్‌లో లో తన తాజా ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రం పబ్లిసిటీ క్యాంపైన్ కార్యక్రమానికి హాజరైన శ్రీదేవి ఇలా చెప్పుకొచ్చింది.
శ్రీదేవి మాట్లాడుతూ...''నా కెరీర్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు సాగడం వల్ల సరైన సమయానికి వివాహం చేసుకోలేకపోయాను. అలాంటి పరిస్థితి నా కూతుళ్లకు రానివ్వను. అందుకే సరైన వయసులోనే నా కుమార్తెలకు వివాహం చేసేయాలనుకుంటున్నాను'' అంది. ఇక వాళ్లను హీరోయిన్లు చేసే ఉద్దేశం లేదా అని అనడిగితే -''నాకే కాదు. వాళ్లకీ ఆ ఉద్దేశం లేదు. నాకు చిన్నతనం నుంచి నటన అంటే ఇష్టం. కానీ జాహ్నవికి ఏది ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఒక్క నటన గురించి తప్ప రకరకాల కెరీర్స్ గురించి ఆలోచిస్తుంటుంది. '' అని చెప్పారు శ్రీదేవి. ప్రస్తుతం జాహ్నవి వయసు పదిహేనేళ్లు.
ఇక శ్రీదేవి చిత్రం చాలా రోజుల తర్వాత తెలుగులో చూసే అవకాశం కలుగుతోంది. అయితే అది స్టైయిట్ గా ఆమె తెలుగులో చేస్తున్న చిత్రం కాదు. ఆమె నటించిన హిందీ చిత్రం ఇంగ్లీష్..వింగ్లీష్ డబ్బింగ్. తెలుగు,తమిళ భాషల్లో ఉన్న ఆమె అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఇలా రిలీజ్ చేస్తున్నారు.అమితాబ్ తో చీనీకామ్ తీసిన బాల్కీ భార్య గౌరీ షిండే ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ ఇక ఈ సినిమాలో శ్రీదేవిదే మేయిన్ రోల్.వచ్చి రానీ ఇంగ్లీష్ తో అష్టకష్టాలు పడేలా ఆమె పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ద్వారా ఇంగ్లీష్ వ్యాఖ్యాల్లో దాగి ఉన్న హాస్యాన్ని పండించనున్నారు. అందుకే ఇంగ్లీష్ లో పట్టుసాధించేందుకు ఆమె అమెరికా వెళ్లనునుంది. ఇందునిమిత్తం ఆమె ఆ మద్య అమెరికా కూడా వెళ్లి వచ్చిందని వినపించింది. చాలా కాలం తర్వాత మళ్లీ తను కెమెరా ముందుకు రావటంతో శ్రీదేవి భర్త బోనీకపూర్ ఫిలీం మేకర్ బాల్కీ కూడా శ్రీదేవి వెన్నంటి ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











