సింగపూర్ రెస్టారెంటులో శ్రీదేవి బొమ్మ.... గర్వంగా ఫీలైన బోనీ కపూర్!
అతిలోక సుందరి శ్రీదేవి అభిమాని ఒకరు సింగపూర్ లోని తన రెస్టారెంటులో శ్రీదేవి బొమ్మ ఏర్పాటు చేశారు.
Recommended Video

అతిలోక సుందరిగా ఒకప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ రారాణిగా వెలుగొందిన శ్రీదేవికి అప్పట్లో ఏ హీరోయిన్ కు లేనంత ఫాలోయింగ్ ఉండేది. ప్రస్తుతం ఆమె ఫాంలో లేక పోయినా ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు.
శ్రీదేవి అభిమాని ఒకరు సింగపూర్‌లోని తన రెస్టారెంట్‌లో ఆమె బొమ్మను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఆ రెస్టారెంటకు వచ్చే వారిని అందమైన శ్రీదేవి బొమ్మ ఎంతగానో ఆకట్టుకంటోంది. ఈ బొమ్మ విషయం శ్రీదేవి భర్త బోనీకపూర్ దృష్టికి రావడంతో సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేశారు.

గర్వంగా పీలవుతున్న బోనీ కపూర్
"మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమెకు ఎంత స్టార్ డమ్ ఉందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. చాలా సంతోషంగా ఉంది'' అంటూ బోనీ కపూర్ తన భార్య గురించి గర్వంగా చెప్పారు.

వెలకట్టలేని అభిమానం
రెస్టారెంటులో తన బొమ్మ ఏర్పాటు చేయడంపై శ్రీదేవి ఆనందం వ్యక్తం చేశారు. తనకు మాటలు రావడం లేదని, తన పేరును ఎంతో స్వీట్ గా వాడుకుంటున్నారని చెప్పారు. గత యాభై ఏళ్లుగా అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు.

శ్రీదేవి సినిమాలు
ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి..... చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘మామ్' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నెక్ట్స్ మూవీలో కూతురుతో కలిసి?
‘మామ్' సినిమా తర్వాత శ్రీదేవి ఏ సినిమాకు కమిట్ కాలేదు. అయితే తన కూతురు జాన్వి కపూర్‌తో కలిసి ఓ సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











