»   » అంతా గందరగోళం.. శ్రీదేవి మద్యం తాగదు.. టబ్‌లోకి వేడినీళ్లు.. తెరపైకి అమర్‌సింగ్ పేరు..

అంతా గందరగోళం.. శ్రీదేవి మద్యం తాగదు.. టబ్‌లోకి వేడినీళ్లు.. తెరపైకి అమర్‌సింగ్ పేరు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటి శ్రీదేవి మృతి అంశం అనేక మలుపులు తీరుగుతున్నది. ఫొరెన్సిక్ నివేదిక తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో శ్రీదేవి మరణం సహజం కాదనే అంశంపై సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి అంత్యక్రియలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఏర్పడింది.

బాత్‌టబ్‌లోకి వేడి నీళ్లు

బాత్‌టబ్‌లోకి వేడి నీళ్లు

బాత్‌టబ్‌లోకి వేడి నీళ్లు రావడంతో శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిందనే వాదన వినిపిస్తున్నది. ఒకవేళ వేడి నీళ్లు వస్తే శ్రీదేవి కేకలు వేయలేదా? ఒకవేళ జరిగితే బోనికి వినిపించలేదా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అమర్‌సింగ్‌ భిన్నవాదన

అమర్‌సింగ్‌ భిన్నవాదన

శ్రీదేవి అల్కాహాల్ తీసుకోదని రాజకీయ నేత అమర్ సింగ్ చెప్పడం ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఇలా అనేక వాదనలు, ప్రశ్నలతో శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీదేవి మృతదేహం వస్తుందా?

శ్రీదేవి మృతదేహం వస్తుందా?

శ్రీదేవి మరణం కేసు మిస్టరీ మారిన నేపథ్యంలో ఆమెను ముంబైకి తీసుకొచ్చే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ కేసు ఓ కొలిక్కి రాకపోతే శ్రీదేవి అంత్యక్రియలు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

 మరోసారి హోటల్ గదిలోకి

మరోసారి హోటల్ గదిలోకి

ఇప్పటికే దుబాయ్ పోలీసులు శ్రీదేవి ఉన్న హోటల్ గదిని సీజ్ చేశారు. అవసరమైతే మరోసారి హోటల్ గదిని పోలీసులు మరోసారి పరీక్షించే అవకాశం కనిపిస్తున్నది.

మరణం అంతా గందరగోళమే

మరణం అంతా గందరగోళమే

ఫొరెన్సిక్ నివేదిక అందినప్పటికీ.. శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయకపోవడంతో గందరగోళం నెలకొన్నది. ఇప్పటి వరకు సహజ మరణమే అని భావించినప్పటికీ.. ఇలా అనేక అనుమానాలకు దారి తీయడం అభిమానులను కుంగదీస్తున్నది.

English summary
Sridevi died due to accidental drowning, the Bollywood icon's death certificate, a copy of which is with IndiaToday.in, says. Sridevi, unarguably India's first female superstar, died late Saturday night in Dubai where she was attending a wedding. The cause of Sridevi's death - accidental drowning - was confirmed by the Dubai government via its press arm's official Twitter account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu