టొరెంటో ఫిలిం ఫెస్టివల్లో శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’

By Bojja Kumar

ముంబై: 'అతిలోక సుందరి' శ్రీదేవి చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' నిర్మాణం శర వేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 6 నుచి 16 వరకు టొరెంటో ఫిలిం ఫెస్టివల్ లో సెప్టెంబర్ 14న గలాస్ సెక్షన్లో 'ఇంగ్లీష్ వింగ్లీష్' వరల్డ్ ప్రీమియర్ షో జరుగుతుది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బాల్కీ మాట్లాడుతూ...'సూపర్ స్టార్ శ్రీదేవి మా ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

సెప్టెంబర్ 14న ప్రతిష్టాత్మక టొరెంటో ఫిలిం ఫెస్టివల్ లో మా చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శించడానికి ఎంపికవడం వలన మా యూనిట్ అంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంతో కామెడీగా, ఎంతో సెన్సెటివ్ గా మంచి ఫీల్ తో సాగే బ్యూటిఫుల్ చిత్రమిది. టొరెంటో ఫిలిం ఫెస్టివల్ లో బాబ్ థాంటన్, రోగర్ మైఖేల్, రాబర్ట్ రెడ్ పోర్ట్, మైక్ నేటెల్, బిస్ అప్లెన్, మీరా నాయర్ ల చిత్రాలతో పాటు మా 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం ప్రీమియర్ ప్రదర్శిస్తున్నందుకు చాలా ఎక్సైట్ అవుతున్నాం' అన్నారు.

ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X