బికినీలో శ్రీదేవి, కూతురు ఝాన్వి హంగామా (ఫోటోలు)
ముంబై: నూతన సంవత్సర వేడుకలను నటి శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంది. భర్త బోనీ కపూర్, కూతుర్లు ఝాన్వి కపూర్, ఖుషి కపూర్‌తో కలిసి వెకేషన్ వెళ్లిన శ్రీదేవి సముద్రం ఒడ్డున సేద తీరుతూ గడిపారు. ఫ్యామిలీతో కలిసి దిగిన ఆ ఫోటోలను శ్రీదేవి తన ట్విట్టర్లో పోస్టు చేయడం విశేషం.
2014 సంవత్సరంలో అందరికీ శుభం జరుగాలని, సంతోషంగా ఉండాలని శ్రీదేవి ట్వీట్ చేసింది. కాగా...శ్రేదేవి ఈ ఫోటోలు పోస్టు చేయడం, ఈ జోరు చూస్తుంటే ఆమె కూతురు ఝాన్విని ఈ సంవత్సరం వెండితెరకు పరిచయం చేసే అవకాశం ఉందిన అంటున్నారు. అయితే మరి శ్రీదేవి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు చేస్తుందనేది వేచి చూడాలి.
ఫ్యామిలీతో కలిసి శ్రీదేవి వెకేషన్ వెళ్లిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఝాన్వి కపూర్ సినిమా ఎంట్రీ?
కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంతో ఝాన్వి బాలీవుడ్‌కి పరిచయం కాబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కరుణ్ జోహార్‌తో బోనీ కపూర్ చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ వంటి స్టార్ దర్శక, నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ అంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు. కరుణ్ జోహార్ త్వరలో రూపొందించబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

శ్రీదేవి ఏమంటోంది?
గత ఏడాది కూడా ఇలాగే పలుమార్లు వార్తలొచ్చినా... తన కూతురు ఇప్పుడే సినిమాల్లోకి రాదని శ్రీదేవి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఝాన్వి చదువు పూర్తయ్యాకే తన ఇష్ట ప్రకారం ఆమె కెరీర్‌ను ఎంపిక చేసుకొంటుందని శ్రీదేవి తెలిపింది.

ఝాన్వి ఏం చేస్తోంది?
ప్రస్తుతం ఝాన్వి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. డైలాగ్స్ ఎలా పలకాలో కూడా తెలుసుకుంటోంది. జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు.

ఖుషి బర్త్ డే సందర్భంగా...
తన చిన్న కూతురు ఖుషి కపూర్ పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి తన పిల్లలు, వారి స్నేహితులతో కలిసి ఇలా సరదాగా గడిపింది. నవంబర్ నెలలో ఖుషి బర్త్ డే జరిగింది.


Click it and Unblock the Notifications











