శ్రీదేవి అంత్యక్రియలు పూర్తి .. నిండు ముత్తైదువగా శాశ్వత నిద్రలోకి.. కంటతడి పెట్టించిన వర్మ..

By Rajababu

సినీ జగత్తులో అందాల తార శ్రీదేవి శకం ముగిసింది. కోట్లాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు గుండెకోత పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఫిబ్రవరి 24న తేదీ అర్ధరాత్రి శ్రీదేవి ప్రమాదవశాత్తూ దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఆకస్మిక మరణానికి గురైన సంగతి తెలిసిందే. శ్రీదేవి అంతిమయాత్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లోకండ్‌వాలాలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ నుంచి బయలు దేరింది. అశ్రునయనాలతో అభిమానులు శ్రీదేవికి తుది వీడ్కోలు పలికారు.

Recommended Video

Sridevi Mortal being taken for Cremation, Watch Video
ఇసుకవేస్తే రాలనంత జనం

ఇసుకవేస్తే రాలనంత జనం

శ్రీదేవి అంతిమయాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం వాహనం వెంట నడిచారు. ముంబై వీధుల్లో భవనాలు, బహుళ అంతస్థుల ఇళ్లపై నుంచి ప్రజలు శ్రీదేవిని కడసారి దర్శించుకొన్నారు.

8 కిలో మీటర్లు అంతిమయాత్ర

8 కిలో మీటర్లు అంతిమయాత్ర

శ్రీదేవి అంతిమయాత్ర దాదాపు 8 కిలోమీటర్లు సాగి మధ్యాహ్నం 4 గంటలకు విలే పార్లే సేవాసమాజ్ పవన్ హాన్స్ హిందూ శ్మశాన వాటిక వద్దకు చేరింది.

హిందూ ఆచారాలతో

హిందూ ఆచారాలతో

అనిల్ కపూర్, అర్జున్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు శ్రీదేవి భౌతికకాయాన్ని శ్మశాన వాటికలోకి తరలించారు. హిందు సంప్రదాయం, ఆచారాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

నిండు ముత్తైదువలా శ్రీదేవి

నిండు ముత్తైదువలా శ్రీదేవి

అంతిమయాత్రకు ముందు శ్రీదేవిని నిండు ముత్తైదువలా అలకించారు. నిండు ముత్తైదువల కనిపించిన గాఢ నిద్రలో ఉన్నట్టు కనిపించింది. ప్రశాంతంగా శ్రీదేవి ముఖం కనిపించింది.

బోని కపూర్ తలకొరివి

బోని కపూర్ తలకొరివి

శ్రీదేవి భౌతికకాయాన్ని చితిపై పెట్టిన తర్వాత భర్త బోనికపూర్ తల కొరివి పెట్టారు. మూడుసార్లు ప్రదక్షిణలు చేసి హిందూ సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీదేవి చితికి బోని కపూర్ నిప్పు

శ్రీదేవి చితికి బోని కపూర్ నిప్పు

కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటీ స్వాగతం నడుమ శ్రీదేవి చితికి బోనికపూర్, కూతుళ్లు జాహ్నవి, ఖుషీ నిప్పు నిప్పంటించారు. దాంతో జాహ్నవి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు.

చివరి వరకు అనిల్ కపూర్

చివరి వరకు అనిల్ కపూర్

శ్రీదేవితో పలు చిత్రాల్లో నటించిన బోనికపూర్ సోదరుడు, నటుడు అనిల్ కపూర్ అంతిమయాత్ర వాహనంలో ప్రయాణించారు. విషాద వదనంతో అర్జున్‌కపూర్‌ను ఓదార్చుతూ అనిల్ కపూర్ కనిపించారు.

కిక్కిరిసిన శ్మశాన వాటిక

కిక్కిరిసిన శ్మశాన వాటిక

శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గోనేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులతో పవన్ హాన్స్ శ్మశాన వాటిక కిక్కిరిసిపోయింది. శ్రీదేవి అంతిమ సంస్కారాలను చూసేందుకు సమీపంలోని బిల్లింగులను, చెట్లపైకి ఎక్కడం గమనార్హం.

భారీ భద్రత నడుమ

భారీ భద్రత నడుమ

శ్రీదేవి అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. శ్మశాన వాటిక వద్ద, అంతిమయాత్రలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులను విధుల్లోకి దింపారు.

 జాతీయ పతాకం కప్పి..

జాతీయ పతాకం కప్పి..

ప్రపంచ సినీ జగత్తులో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన శ్రీదేవికి ప్రభుత్వం గౌరవ వందనం సమర్పించింది. జాతీయ పతాకాన్ని కప్పి శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రముఖులను మాత్రమే..

ప్రముఖులను మాత్రమే..

శ్మశాన వాటికలోకి సాధారణ జనాన్ని లోనికి అనుమతించలేదు. కేవలం ప్రముఖులను మాత్రమే లోనికి పంపించారు. శ్మశాన వాటిక వద్దకు కూతురు ఖుషీతోపాటు బోనికపూర్ కనిపించారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కంటతడి పెట్టించిన వర్మ ట్వీట్

అంతిమయాత్ర జరుగుతుండగానే శ్రీదేవి గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ కంటతడి పెట్టించేలా ట్వీట్ చేశారు. థియేటర్స్‌లో శ్రీదేవి అద్భుతమైన ఎనర్జీతో చేసే డ్యాన్స్‌ను, యాక్టింగ్‌ను చూసేందుకు జనం అలా కూర్చుండిపోయేవారు. అలాగే ఇప్పుడు కూడా ఆమె చుట్టూ జనం ఉన్నారు. కానీ కన్నీళ్లతో పగిలిన హృదయాలతో అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

శ్మశాన వాటిక వద్ద తొక్కిసలాట

శ్మశాన వాటిక వద్ద తొక్కిసలాట

శ్రీదేవి శ్మశాన వాటిక వద్ద అభిమానులను ఆపివేయడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఫ్యాన్స్‌ను నియంత్రించడానికి పోలీసులు తంటాలు పడ్డారు.

లాఠీకి పనిచెప్పిన పోలీసులు

లాఠీకి పనిచెప్పిన పోలీసులు

అభిమానులు పోటెత్తడంతో శ్రీదేవి పార్థీవ దేహాన్ని శ్మశాన వాటిక వద్దకు చేర్చడానికి చాలా కష్టమైంది. దాంతో ఆమె అంత్యక్రియలు ఆలస్యం జరిగింది. చివరకు పోలీసుల లాఠీకి పనిచెప్పడంతో శ్రీదేవి భౌతిక కాయాన్ని చితిపైకి తీసుకెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X