ఫ్రెంచి యాక్టర్‌తో శ్రీదేవి రొమాన్స్!
ఒకప్పటి అందాల తార శ్రీదేవి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'ఇంగ్లిష్ వింగ్లిష్" చిత్రం ద్వారా ఆమె మళ్లీ రంగుల సినీ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాని ఓ గృహిణి పాత్రలో నటిస్తున్న శ్రీదేవి..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ భార్య గా నటిస్తోంది. తన వచ్చి రాని ఇంగ్లీష్ తో నవ్వుల పాలపాలవుతున్న తనను తాను మార్చుకోవడానికి ఇంగీష్ కోర్సులో జాయిన్ అవుతుంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రీదేవి ఫ్రెంచి యాక్టర్ మెహ్దినిబూతో రొమాన్స్ చేస్తుందట. తను ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వెళ్లిన చోట ఇతగాడు శ్రీదేవికి పరిచయం అవుతాడట. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య లవ్ అండ్ రొమాన్స్ చోటు చేసుకుంటాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూయార్కలో జరుగుతోంది. ఈ సినిమాకు గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకేసారి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..


Click it and Unblock the Notifications











