»   » మేగజైన్ కోసం శ్రీదేవి సెక్సీ భంగిమల్లో...(ఫోటోలు)

మేగజైన్ కోసం శ్రీదేవి సెక్సీ భంగిమల్లో...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా వన్నెదగ్గని అందంతో వెలిగిపోతూ...'అతిలోక సుందరి' అనే పేరును సార్ధకం చేసుకుంటోంది హీరోయిన్ శ్రీదేవి. తాజాగా శ్రీదేవి కుర్ర హీరోయిన్లను తలదన్నే రేంజిలో వోగ్ మేగజైన్ కోసం సెక్సీ భంగిమలతో హాట్ హాట్‌గా ఫోటో షూట్లో పాల్గొంది.

ఈ ఫోటోల్లో ఆమెను చూస్తుంటే వయసులో ఉన్న రోజ్లో సెక్సీగా తన అందాచందాలతో అభిమానులను అలరించిన శ్రీదేవి గుర్తొస్తుందని, ఆమెలో గ్లామర్ పాళ్లు ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు అభిమానులు. ఇలా ఫోటో షూట్లలో శ్రీదేవి జోరు చూస్తుంటే ఆమె సినిమాల్లో తన స్పీడు పెంచుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమాలకు దూరమైన చాలా కాలం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, తనకు సూటయితే మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమే అంటున్నారు.....

వోగ్ మేగజైన్‌పై శ్రీదేవి లుక్ అదిరింది

వోగ్ మేగజైన్‌పై శ్రీదేవి లుక్ అదిరింది

వోగ్ మేగజైన్ కోసం శ్రీదేవి వివిధ భంగిమల్లో సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఆమె లుక్స్ అదిరాయని, వయసుకు మించిన గ్లామర్‌తో శ్రీదేవి ఇప్పటి హీరోయిన్లను డామినేట్ చేసేలా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. అతిలోక సుందరి అంటూ పొగిడేస్తున్నారు.

15 ఏళ్ల తర్వాత

15 ఏళ్ల తర్వాత

దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆమె మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారతీయుల అభిమాన తార

భారతీయుల అభిమాన తార

సౌతిండియాలో పుట్టిన శ్రీదేవి ఇక్కడ తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నెం.1 స్థానికి చేరుకుని తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

త్వరలో టెలివిజన్ షో...

త్వరలో టెలివిజన్ షో...

త్వరలో శ్రీదేవి ప్రముఖ టెలివిజ్ షో ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాగా ప్రజాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి' షో తెలుగు వెర్షన్ శ్రీదేవి ద్వారా ప్రారంభం కాబోతోందని అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

శ్రీదేవి వారసురాలు జాన్వి

శ్రీదేవి వారసురాలు జాన్వి

శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ త్వరలో హీరోయిన్ గా వెండితెర అరంగ్రేటం చేయనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగిన విధంగా వివిధ కార్యక్రమాల్లో జాన్వి కపూర్ ఆటిట్యూడ్ ఉండటం గమనార్హం.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో

ఇప్పటికే సీసీఎల్‌(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో ఓ ఫ్రాంచైజీ సొంతం చేసుకుని సినిమా రంగంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న శ్రీదేవి...ఇక బుల్లితెరపై తన సత్తా చాటాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే తెలుగులో ‘కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఫ్యాన్స్ కోరిక ఏమిటంటే..

ఫ్యాన్స్ కోరిక ఏమిటంటే..

శ్రీదేవి సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించినా ఇప్పటి వరకు కేవలం ఒక సినిమా మాత్రమే చేసింది. ఆమె మరిన్ని సినిమాల్లో నటించి అలరించాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై శ్రీదేవి స్పందిస్తూ సరైన కథల కోసం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.

English summary
Bollywood actress Sridevi and Boney Kapoor's first cover shoot for Vogue India. Take a look at this recent picture released by our actress on her photo shoot with Vogue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu