ప్రభుదేవాతో డాన్స్, సవాల్ అంటున్న శ్రీదేవి
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి తన భర్త బోనీ కపూర్, కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి చైనాలోని మాకావు వెళ్లింది. చాలా కాలం తర్వాత శ్రీదేవి మళ్లీ స్టెప్పులు వేస్తుండటంతో అభిమానులు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలో శ్రీదేవి ప్రముఖ టెలివిజ్ షో ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాగా ప్రజాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో తెలుగు వెర్షన్ శ్రీదేవి ద్వారా ప్రారంభం కాబోతోందని అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.
ఇప్పటికే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో ఓ ఫ్రాంచైజీ సొంతం చేసుకుని సినిమా రంగంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న శ్రీదేవి...ఇక బుల్లితెరపై తన సత్తా చాటాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే తెలుగులో 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications












