రామచరణ్ సినిమాలో శ్రీదేవి

చిరంజీవి కుమారుడు హీరోగా నటిస్తున్న ధీరుడు సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ అందాల తార శ్రీదేవి అతిథి పాత్రలో నటించనుందట. ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ విషయం నిర్ధారణ కాలేదు. చాలా కాలంగా తిరిగి సినిమాల్లో నటించాలని శ్రీదేవి అనుకుంటోంది. దానికి ముందు ప్రేక్షకున నాడిని తెలుసుకోవాలని ఆమె భావిస్తోందట. అందుకు ధీరుడు సినిమాలో అతిథి పాత్ర మంచి అవకాశమని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సరసన శ్రీదేవి పలు సినిమాల్లో హీరోయినుగా నటించింది. శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోలను రామచరణ్ అందరికీ చూపిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











