అందాల విందు చేయడానికి శ్రీదేవి కూతురొస్తోంది (ఫోటోలు)
హైదరాబాద్: హీరోలు, హీరోయిన్లు వారసత్వాన్ని పునికి పుచ్చుకుని వారి కొడుకులు, కూతుళ్లు కూడా సినిమా రంగంలోకి రావడం చాలా కాలంగా నడుస్తున్న తంతే. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వి కూడా ఈ లిస్టులో చేరి పోయింది. జాన్వి హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా....శ్రీదేవి మాత్రం ఇంకా చాలా సమయం ఉందంటూ దాట వేస్తూ వచ్చింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీదేవి ఇపుడు కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేసే విషయమై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి....ఏప్రిల్‌లో మరో సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఆమె ఇపుడు ఆ సినిమా చేసే ప్లాన్స్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
మరి శ్రీదేవి ఆ సినిమా ప్లాన్స్ ఎందుకు వాయిదా వేసుకుందనే విషయాల గురించి ఆరా తీస్తే....కూతురు హీరోయిన్‌గా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.

జాన్వి కపూర్
హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఉన్న జాన్వి కపూర్ ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా ప్రత్యేక మైన వస్త్రధారణలో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో దర్శనమిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకునే ప్రచత్నం చేస్తోంది.

కరణ్ జోహార్
కరుణ్ జోహార్ వంటి స్టార్ దర్శక, నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ అంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు. కరుణ్ జోహార్ ఈ చిత్రాన్ని ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరరెక్కించబోతున్నారు.

ఫ్యామిలీ సపోర్టు
సినిమా వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆరంగం వైపు ఆకర్షితులవ్వడం మామూలే. హీరోయిన్ కావాలనే జాన్వి కోరికకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్టుగా ఉంటున్నారట.

జాన్వి ట్రైటింగ్
ప్రస్తుతం ఝాన్వి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. డైలాగ్స్ ఎలా పలకాలో కూడా తెలుసుకుంటోంది. జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











