నా సినిమాకు శ్రీదేవే హీరో..
ఈ సినిమా గురించి దర్శకురాలు గౌరీ మాట్లాడుతూ 'నా సినిమాకు శ్రీదేవి హీరో. ముందు నేను స్ర్కిప్టు రాసుకున్నప్పుడు ఎవరిని ఎంపిక చేయాలనే విషయం ఆలోచించలేదు. శ్రీదేవి గురించిన ఆలోచనే రాలేదు. ఒక రోజు నా భర్త బాల్కీ బోనీ కపూర్, శ్రీదేవిని కలిసారు. ఈ క్రమంలో నేను కథ తయారు చేసుకున్న విషయం శ్రీదేవి తెలుసుకుని, నా కథ నచ్చి ఆమె చేయడానికి ఒప్పుకుంది' అని వెల్లడించారు.
నేను ఈ సినిమా తీయడానికి మా అమ్మే ఆదర్శం. ఇండియాలో చాలా మంది ఇంగ్లీష్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ చిత్రంలో వారిలో ఉండే అభద్రతా భావాన్ని, చురుకుదనాన్ని చూపించబోతున్నాను అని చెప్పారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అమితాబ్ అతిథి పాత్రలో నటించనున్నట్లు గౌరీ తెలిపారు. ఆయన ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఉంటే సినిమా హిట్టవుతుందనే సెంటిమెంటు మాకు కలిసొస్తుందని నమ్ముతున్నామన్నారు.
ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.


Click it and Unblock the Notifications












