మహేష్ కి ఇష్టమైన హీరోయిన్, సినిమా ఏంటంటే
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్, బాబు కు అత్యంత ఇష్టమైన అభిమాన హీరోయిన్ ఎవరై ఉంటారు..ఉన్నా చెప్తారా..అలాగే..ఫేవెరెట్ సినిమా ఏదై ఉంటుంది అంటే సమాధానం దొరికింది. మహేష్ ఈ విషయాలను ఈటీవిలో ప్రసారమైన 'మనంతా మహేష్' పోగ్రామ్ లో రివిల్ చేసారు. యాంకర్ ఝాన్సి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పుకొచ్చారు.
మహేష్ మాట్లాడుతూ... "నా చిన్నప్పటి నుంచే కాదు , ఇప్పటికీ నా ఫేవెరెట్ హీరోయిన్ శ్రీదేవి మాత్రమే ". అన్నారు. ఝాన్సీ మీ చిన్నప్పటి రోజుల్లో మీ ఫెవరెట్ హీరోయిన్ ఎవరూ అని అడిగిన ప్రశ్నకు సమాధానమిలా ఇచ్చారు.

ఇక ఆయన ఫేవెరెట్ మూవి గురించి చెప్తూ..." ఒక్కడు సినిమా నా ఫేవరెట్ చిత్రం. పోకిరీ, దూకుడు కూడా నాకు బాగా నచ్చిన సినిమాలే. ఎందుకంటే అవి రెండూ నాకు కొత్త స్టార్ డమ్ ని క్రియేట్ చేసాయి. అందుకే అవి నాకు చాలా చాలా ఇష్టం ". అన్నారు.
ఆగడు చిత్రం గురించి చెప్తూ... " నేను ఎప్పుడూ శ్రీను వైట్లతో పనిచేయటానికి ఇష్టపడతాను. అందుకే నేను ఆగడు చిత్రం కోసం ఎదురుచూస్తున్నాను. అన్నారు. ఇక మహేష్ చిత్రాల్లో చేసే డేరింగ్ స్టంట్స్ గురించి మీరు భయపడరా అని అడగగా... " ఎందుకు భయపడను..అయితే షూటింగ్ సమయంలో వాటిని వదిలేసి పనిచేస్తాం. నాకు 1 నేనొక్కడినే చిత్రం చేసే దాకా స్విమ్మింగ్ అంటే తెలియదు. అయితే మేం ఆ బోట్ సీన్ మొత్తం సముద్రం మధ్యలో షూట్ చేసాం. మొదట్లో భయపడ్డాం కానీ, ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక ఇక అలాంటి ఆలోచనలు నా మనస్సులోకి రావు. ఎందుకనో తెలియదు ". అన్నారు.


Click it and Unblock the Notifications











