twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవీ జీవితంలో కీలకఘట్టాలు పదహారేళ్ల వయసుతో.. అంచెలంచెలుగా.. సూపర్‌స్టార్లకు ధీటుగా

    By Rajababu
    |

    Recommended Video

    శ్రీదేవీ జీవితంలో కీలకఘట్టాలు...!

    బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్‌గా అలరించారు. సుమారు ఐదు దశాబ్దాలుగా తన నటనతో, మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆమె కెరీర్ సాగిందిలా..

    అనతికాలంలోనే శ్రీదేవి

    అనతికాలంలోనే శ్రీదేవి

    అందంతో ఆకట్టుకొంటూ శ్రీదేవి అనతికాలంలోనే అగ్ర కథానాయిక అని పేరు తెచ్చుకొన్నది. తన నటనా జీవితాన్ని బాలనటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టిన అంచెలంచెలుగా ఎదిగింది. తొలుత తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. తెలుగు సినీ రంగాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా శాసించారు.

    మలయాళ చిత్రపరిశ్రమలో

    మలయాళ చిత్రపరిశ్రమలో


    మలయాళ చిత్రపరిశ్రమలో డైరెక్టర్ ఐవీ శశి దర్శకత్వంలోనే ఎక్కువగా నటించారు. ఆమె నటించిన ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవుమ్ శిక్షయుమ్, ఆ నిమషం అనే చిత్రాలు ఆదరణ పొందాయి.

    తమిళ చిత్రపరిశ్రమలో

    తమిళ చిత్రపరిశ్రమలో


    1976 లో బాలచందర్ చిత్రం "మూండ్రు ముదచ్చు"లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. రజనీ కాంత్‌తో ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు.

    కమల్ హాసన్‌తో

    కమల్ హాసన్‌తో

    మూండ్రు ముదచ్చు చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఓ మైలురాయిగా నిలిచింది. . మూండ్రు ముడిచ్చు తర్వాత శ్రీదేవి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్‌తో ఆమె గురు, శంకర్‌లాల్, సిగప్పు రోజక్కల్. తాయుళ్లమాల్ నానిల్లై, మీండుం కోకిల, వాజ్వే మాయం, వరుమైయిన్ సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రం పిరై, 16 వయత్తినిలే మొదలగు చిత్రాలలో నటించారు.

    పదహారేళ్ల వయసుతో

    పదహారేళ్ల వయసుతో

    పదహారేళ్ల వయసుతో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. కొద్దికాలంలోనే అగ్రశ్రేణి హీరోయిన్‌గా మారింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. ఆమె ఎక్కువగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే నటించారు. ఎన్.టి.రామారావుతో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు.

    అక్కినేని నాగేశ్వరరావుతో

    అక్కినేని నాగేశ్వరరావుతో

    అక్కినేని నాగేశ్వరరావుతో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ/కృష్ణ గారితో కలిసి ఆమె కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తర్వాత కృష్ణతోనే ఎక్కువ చిత్రాలలో శ్రీదేవి నటించారు.

    హిందీ సినీ రంగంలో

    హిందీ సినీ రంగంలో

    ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆరంభంలో ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు. వాటిలో అధిక శాతం తెలుగు నుంచి రీమేక్ చేయబడినవే. ఆమె నటించిన హిందీ చిత్రాలకు ఎక్కువగా రాఘవేంద్రరావు, బాపయ్య దర్శకత్వం వహించారు.

    అమోల్ పాలేకర్‌తో

    అమోల్ పాలేకర్‌తో

    1978లో శ్రీదేవి తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. అమోల్ పాలేకర్‌తో సోల్వా సావన్ అనే చిత్రంలో నటించారు, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించలేదు. కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన హిమ్మత్‌వాలా చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత శ్రీదేవిని ఉత్తర భారతదేశంలో థండర్ థౌస్ అని పిలిచారు.

    కమల్ హాసన్‌తో నటించిన

    కమల్ హాసన్‌తో నటించిన

    ఆ తర్వాత కమల్ హాసన్‌తో నటించిన సద్మ చిత్రం ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. 1980 లలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని, నగీనా, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్‌బాజ్, ఖుధాగవా, లమ్హే, లాడ్లా, జుదాయి లాంటి చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి.

    మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డు

    మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డు

    చాల్‌బాజ్ చిత్రానికి హగానూ ఆమెకి హిందీలో మొదటి ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంలో ఆమెకు "మిస్ హవా హవాయి అని పేరు వచ్చింది. ఆ చిత్రంలో ఆమె చార్లీ చాప్లిన్‌ హావభావాలు ప్రదర్శించి నటనా ప్రతిభతో ఆకట్టుకొన్నారు. తన కెరీర్‌లో చాందిని చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయి అని చెప్పుకోవచ్చు.

    English summary
    Sridevi Boney Kapoor, the celebrated Bollywood actor whose contributions to Indian cinema won her a Padma Shri award, died of a massive cardiac arrest in Dubai on Saturday. She was 54. Along with her husband Boney and younger daughter Khushi, Sridevi had travelled to the emirate to attend actor Mohit Marwah's wedding.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X