వావ్.. కూతురిని మించిన అందం.. అందంతో అదరగొడుతున్న శ్రీదేవి..

యువ హీరోయిన్లకు తానేమీ తక్కువ కాదనే రేంజ్‌లో సినీయర్ నటి శ్రీదేవి అందం ఉట్టిపడుతున్నది. కెరీర్ మంచి ఉన్నత స్థితిలో ఉండగానే వైవాహిక జీవితం కోసం శ్రీదేవి నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పిన సంగతి తెలిసిం

By Rajababu

యువ హీరోయిన్లకు తానేమీ తక్కువ కాదనే రేంజ్‌లో సినీయర్ నటి శ్రీదేవి అందం ఉట్టిపడుతున్నది. కెరీర్ మంచి ఉన్నత స్థితిలో ఉండగానే వైవాహిక జీవితం కోసం శ్రీదేవి నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రి ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆకట్టుకొన్నది. ఇటీవల వచ్చిన మామ్ చిత్రంలో నటనతో అందాల తార అదరగొట్టేసింది.

అమెరికాలో మామ్ సక్సెస్ టూర్

అమెరికాలో మామ్ సక్సెస్ టూర్

ప్రస్తుతం మామ్ సక్సెస్ తర్వాత కూతురు జాహ్నవితో కలిసి శ్రీదేవి అమెరికాలో పర్యటిస్తున్నది. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ ఫోటోను అభిమానులు లైకులతో ముంచెత్తుతున్నారు.

Recommended Video

Sridevi Memorized her Career Starting days in film industry
వన్నెతగ్గని శ్రీదేవి..

వన్నెతగ్గని శ్రీదేవి..

మామ్ చిత్రంతో మళ్లీ వెండితెర మీద మెరిసిన శ్రీదేవికి 53 సంవత్సరాలు. అయినా అందంలో ఏమాత్రం వన్నెతగ్గలేదు. కూతురు పక్కన ఉన్న శ్రీదేవి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆమెను చూస్తే యువ హీరోయిన్‌లా కనిపిస్తున్నది.

మరో సినిమాతో రెడీ అవుతున్న శ్రీదేవి

మరో సినిమాతో రెడీ అవుతున్న శ్రీదేవి

ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ చిత్రాల సక్సెస్ తర్వాత శ్రీదేవి మంచి జోరు మీద ఉన్నది. అమెరికా విహారయాత్ర నుంచి తిరిగి రాగానే మరో చిత్రానికి పచ్చజెండా ఊపడానికి సిద్ధంగా ఉన్నట్టు బాలీవుడ్ పత్రికల కథనం. తన చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉండటంతో వరుస చిత్రాలను చేయాలని శ్రీదేవి నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీకి

జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీకి

ఇదిలా ఉండగా, శ్రీదేవి కూతురు జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నది. కరణ్ రూపొందించే సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్‌తో జతకట్టనున్నది. ఈ చిత్రం ది ఫాల్ట్ ఇన్ ఆవర్ స్టార్స్ అనే చిత్రానికి రీమేక్.

జాహ్నవి అఫైర్లపై చర్చ

జాహ్నవి అఫైర్లపై చర్చ

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వకముందే జాహ్నవి టాప్ సెలబ్రిటీగా మారింది. పలువురితో జాహ్నవి అఫైర్లు కొనసాగిస్తున్నారని రూమర్లు తెగ ప్రచారమయ్యాయి. తన స్నేహితులతో అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో జాహ్నవి తీరు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ

త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీకి ముందు పార్టీలు, పబ్‌లకు వెళ్లడం తగ్గించాలని జాహ్నవి కపూర్‌కు ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ ఇటీవల వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. జాహ్నవిని శ్రీదేవి దంపతులు కూడా హెచ్చరించినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X