twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సీ లుక్‌తో మతిపోగొట్టిన శ్రీదేవి (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై : అందానికే అందం నీవే సుందరి....అనే మాట హీరోయిన్ శ్రీదేవికి సరిగ్గా సరిపోతుందేమో. హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అతిలోక సుందరి లాంటి అందచందాలతో భారతీయ ప్రేక్షకులను అలరించిన ఆమె అప్పట్లో నెం.1 తారగా ఓ వెలుగు వెలిగింది.

    పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమై, కుటుంబం, పిల్లల బాధ్యతలు చూసుకోవడానికే పరిమితం అయిన శ్రీదేవి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి పలు సినిమా కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలలో సందడి చేస్తున్న శ్రీదేవి ఈ వయసులోనూ వన్నెతగ్గని అందంతో అందరినీ ఆకట్టుకోవడం విశేషం.

    ప్రస్తుతం ఫాంలో ఉన్న కుర్ర హీరోయిన్లు తలదన్నేలా... వోగ్ మేగజైన్ కోసం ఇటీవల శ్రీదేవి వివిధ భంగిమల్లో సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఆమె లుక్స్ అదిరాయని, వయసుకు మించిన గ్లామర్‌తో శ్రీదేవి ఇప్పటి హీరోయిన్లను డామినేట్ చేసేలా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. అతిలోక సుందరి ఆమెనే అంటూ పొగిడేస్తున్నారు.

    తాజాగా శ్రీదేవి ఓ ఫ్యాషన్ ఎక్స్‌ఫోలో మోడ్రన్ డ్రెస్సులో హాజరై మరోసారి అందరి మతులూ పొగొట్టింది. ఈ కార్యక్రమానికి కాజోల్, మందిరా బేడి, సోపీ చౌదరి, మధుబాల లాంటి వారు హాజరైనా....శ్రీదేవి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవడం గమనార్హం.

    శ్రీదేవి

    శ్రీదేవి

    మానా శెట్టి నిర్వహించిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో శ్రీదేవి ఇలా మోడ్రన్ డ్రెస్సులో హాజరైంది. ఆమె లుక్ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఎంతో సెక్సీగా ఉండటం అందరినీ ఆకట్టుకుంది.

    వన్నె తగ్గని అందం

    వన్నె తగ్గని అందం

    వయసు పెరిగినా వన్నె తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది హీరోయిన్ శ్రీదేవి. ఇంత అందంగా ఉన్న శ్రీదేవి వయసు 50 అంటే నమ్మడం కష్టమే. ఆమె గ్లామర్ రహస్యం ఏమిటో తెలియదు కానీ....తోటీ హీరోయిన్లు శ్రీదేవి అందం చూసి కుళ్లుకుంటున్నారట.

    కాజోల్, మందిరా బేడీ

    కాజోల్, మందిరా బేడీ

    మానా శెట్టి నిర్వహించిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో బాలీవుడ్ స్టార్ కాజోల్‌తో పాటు మోడల్ మందిరా బేడీ కూడా హాజరయ్యారు. మందిరా బేడీ సారీలో హాజరవ్వగా, కాజోల్ ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ లో హాజరైంది.

    మధుబాల

    మధుబాల

    మానా శెట్టి నిర్వహించిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో నటి మధు బాలతో పాటు, సునీల్ శెట్టి కూడా హాజరయ్యారు. ఒక హీరోయిన్‌గా కనిపించిన మధుబాల చాలా ఏళ్ల తర్వాత ఇటీవల తెలుగులో అంతకు ముందు ఆ తరువాత చిత్రంలో కనిపించింది.

    సోఫీ చౌదరి

    సోఫీ చౌదరి

    బాలీవుడ్ నటి సోఫీ చౌదరి మానా శెట్టి నిర్వహించిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో ఇలా మెడ్రన్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. హాట్ ఐటం గర్ల్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన సోఫీ చౌదరి ఈ మధ్య ఎక్కడ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ ప్రత్యక్షం అవుతోంది.

    English summary
    Shopaholics and Fashionista's headed to an 'Aaraish' a fashion expo organised by Mana Shetty in aid of 'Save the Children India '. Spotted at the expo were Sridevi, Kajol, Mandira Bedi, Sophie Choudry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X