»   » అతను ఎమోషనల్‌గా టచ్ చేస్తాడంటున్న శ్రీదేవి (ఫోటోలు)

అతను ఎమోషనల్‌గా టచ్ చేస్తాడంటున్న శ్రీదేవి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'తారే జమీన్ పర్' ఫేం అమోల్ గుప్తేపై సినీయర్ నటి శ్రీదేవి ప్రశంసల వర్షం కురిపించింది. అతని సినిమాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేస్తాయని వ్యాఖ్యానించారు. అమోల్ గుప్తే దర్శకత్వంలో తెరకెక్కిన 'హవా హవాయ్' చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీదేవి మాట్లాడుతూ....'మిస్టర్ ఇండియా' చిత్రంలో హవా హవాయ్ పాట అందరికీ తెలుసు. ఆ పాటలోని వ్యాఖ్యాన్నే తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్న అమోల్ గుప్తే సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఆయన సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అదే విధంగా ఎమెషనల్‌గా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. 'తారే జమీన్ పర్', 'స్టాన్లీ కా డబ్బా' చిత్రాలు అందుకు ఉదాహరణ' అన్నారు.

'ఇప్పుడే ట్రైలర్ చూసాను. సింప్లిసిటీతో...పవర్ ఫుల్ ఎమెషన్‌తో కూడి ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది' అని శ్రీదేవి తెలిపారు. స్లైడ్ షోలో ఫోటోలు....

హవా హవాయ్

హవా హవాయ్

హవా హవాయ్ చిత్రానికి కథా రచన, దర్శకత్వం, నిర్మాణం అమోల్ గుప్తే కావడం గమనార్హం.

ముఖ్య నటీనటులు

ముఖ్య నటీనటులు

హవా హవాయ్ చిత్రంలో పార్థో గుప్తే, షాకిబ్ సలీమ్, ప్రగ్యా యాదవ్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీదేవి స్పెషల్ అట్రాక్షన్

శ్రీదేవి స్పెషల్ అట్రాక్షన్

తాజాగా విడుదలైన హవా హవాయ్ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో శ్రీదేవి స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఈ చిత్రంలో శ్రీదేవి గెస్ట్ రోల్‌లో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

విడుదల తేదీ

విడుదల తేదీ

‘హవా హవాయ్' చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary

 Bollywood actress Sridevi Kapoor launch the trailer of film Director Amole Gupte's film Hawaa Hawaai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu